బికినీలో శ్రద్ధా కిల్లర్ లుక్ కి మతి చెడేనులే

Thu Jan 26 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Actress shraddha kapoor latest pic

`ఆషిఖి 2`లో అద్భుత నటనతో మంత్రముగ్ధులను చేసింది శ్రద్ధా కపూర్. అప్ కమింగ్ గాయనిగా విరహ ప్రేమికురాలిగా శ్రద్ధా నటనకు యువతరం ప్రేమలో పడిపోతారు. కొన్ని వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న శ్రద్ధా కపూర్ అన్నివేళలా బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో ఉంది. డార్లింగ్ ప్రభాస్ సరసన `సాహో` చిత్రంలో నటించి ఇటు దక్షిణాది యువత హృదయాలను గెలుచుకుంది.వెన్నెల్లో ఆడ పిల్లలా బంగారు బొమ్మలా కనిపించే శ్రద్ధా బికినీలో హొయలు పోవడంలోను తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది. శ్రద్ధా నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. బీచ్ పరిసరాల్లో వైట్ బికినీలో శ్రద్ధా టూ హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఇది లవ్ రాంజాన్ సినిమా నుంచి రిలీజైన హాట్ స్టిల్.

కెరీర్ ఆరంభమే ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఆషికి 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రద్ధా తరువాత స్త్రీ- హైదర్- స్త్రీ- ఏక్ విలన్- చిచోరే- ABCD: ఏ బాడీ కెన్ డ్యాన్స్ వంటి చిత్రాలలో పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల పెద్ద తెరపై కనిపించి కొంత గ్యాప్ వచ్చింది. శ్రద్ధ చివరిగా 2020 చిత్రం టైగర్ ష్రాఫ్- రితీష్ దేశ్ముఖ్ -అంకితా లోఖండేలతో కలిసి `బాఘీ 3`లో కనిపించింది. ఇదే కాకుండా.. నిఖిల్ ద్వివేది - విశాల్ ఫ్యూరియా `నాగిన్` లో కూడా నటిస్తోంది. ఇది 1989 నాటి స్లాప్ స్టిక్ చిత్రం `చాల్ బాజ్` కి మోడ్రన్ రీమేక్. శ్రద్ధా తన కెరీర్ లో ఎన్నడూ చూడని సరికొత్త అవతార్ లో కనిపించనుంది. ఈ చిత్రంలో  ఆకారాన్ని మార్చుకునే సర్పకన్య పాత్రలో కనిపిస్తుంది.

రణబీర్ కపూర్ - శ్రద్ధా కపూర్ జంటగా తదుపరి చిత్రం సెట్స్ లో ఉంది. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. దర్శకనిర్మాత లవ్ రంజన్ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ టైటిల్ `తు ఝూతి మైన్ మక్కార్`.

మొదటి ట్రైలర్ ఆద్యంతం లవ్ రొమాన్స్ ఫన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. ఇందులో రణబీర్ కపూర్ .. శ్రద్ధా కపూర్ డేటింగ్ ప్రేమ వ్యవహారాలు కట్టి పడేసే మ్యాజిక్ ని క్రియేట్ చేసాయి. `తు ఝూతి మైన్ మక్కార్` ట్రైలర్ మోడ్రన్ యూత్ డేటింగ్ వ్యవహారాలకు సంబంధించిన సినిమా అని క్లారిటీనిచ్చింది. రణబీర్ కపూర్- శ్రద్ధా కపూర్ మొదటి సారి జంటగా నటించగాఈ మ్యూజికల్ రొమాంటిక్-కామెడీలో డింపుల్ కపాడియా .. బోనీ కపూర్ కూడా నటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.