Begin typing your search above and press return to search.

సామ్ నిన్ను పెళ్లాడేదెలా! కాస్త చెప్ప‌వా?

By:  Tupaki Desk   |   5 Feb 2023 5:04 PM GMT
సామ్ నిన్ను పెళ్లాడేదెలా! కాస్త చెప్ప‌వా?
X
క‌ళ్లు మూసి తెరిచే లోపు కాలం గ‌ర్భంలో క‌లిసిపోతుంది. క్ష‌ణాలు నిమిషాలు గంట‌లు క‌నుమ‌రుగ‌వుతుంటాయి. కాలంతో పాటు ప‌రిగెత్త‌క‌పోతే ఇక్క‌డ వెన‌క‌బ‌డిపోతాం. క‌ష్టం న‌ష్టం సుఖం దుఃఖం ఎన్ని ఎదురైనా ఎదురీదాలి. ఒక్కోసారి జీవ‌న్మ‌ర‌ణ పోరాటాన్ని కొన‌సాగించాలి. ముఖ్యంగా రంగుల ప్ర‌పంచంలో తార‌గా వెలుగులు విర‌జిమ్మాక అస‌లైన ఛాలెంజ్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్క‌డ మింగే పాములు ఉంటాయి. నిచ్చెన‌లు ఉంటాయి. పాముల‌ను దాటుచుకుని నిచ్చెన‌లు ఎక్కాలి. అంతిమంగా శిఖ‌రానికి చేరాలి. ఈ చ‌ద‌రంగంలో మింగే పాములు ఎన్ని ఎదురైనా దాటుకుని ముందుకు సాగాలి.

తెలుగు సినీవినీలాకాశంలో ఉవ్వెత్తున ఎగ‌సిన అందాల స‌మంత రూత్ ప్ర‌భు ఇటీవ‌ల కొంత క్లిష్ఠ స‌మ‌యాన్ని ఎదుర్కొంటోంది. మ‌యోసైటిస్ రుగ్మ‌త త‌న‌ను ఇబ్బందికి గురి చేస్తున్నా సామ్ త‌న ధైర్యాన్ని కోల్పోలేదు. అనారోగ్యానికి చికిత్స తీసుకుంటూనే త‌న న‌ట‌జీవితాన్ని స‌జావుగా సాగించేందుకు త‌గిన ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసిన తీరుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. సామ్ వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల‌త‌లు క‌ల్లోలాల ఎపిసోడ్ ముగిసింది అనుకుంటుండ‌గానే మయోసైటిస్ లాంటి అరుదైన రుగ్మ‌త త‌న సినీప్ర‌యాణానికి అడ్డంకి అవుతోంద‌ని మీడియాలో అంతా క‌థ‌నాలు వేసారు.

కానీ ఆ విశ్లేష‌ణ‌ల‌కు అతీతంగా సామ్ త‌న‌ను తాను సినీరంగంలో ఘ‌న‌మైన ప్ర‌యాణానికి కాలు క‌దిపింది. య‌థావిధిగా సెట్స్ కి వెళ్లేందుకు సిద్ధ‌మైంది. ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. స‌మంతకు దేశ‌వ్యాప్తంగా అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అందులో ఎంద‌రో ప్రేమికులు ఉన్నారు. సామ్ ని నిరంత‌రం ఇన్ స్టాలో అనుస‌రించే వీరాభిమానులు త‌న‌పై ప్రేమ‌ను కురిపిస్తూనే ఉన్నారు. ఆదివారం నాడు స‌మంత‌ త‌న ఇన్ స్టాగ్రామ్ లో చిరున‌వ్వు మోమును ప్ర‌ద‌ర్శించిన తీరు త‌న‌లో దాగి ఉన్న ఎన్నో భావాల‌ను నిజాల‌ను బ‌య‌ట‌పెట్టింది.

అలా క‌నులు మూసుకుని ఏదో ఊహాలోకంలో స‌మంత విహ‌రిస్తోంది. ఆ విహారంలోనే ఎంతో త‌న్మ‌యంతో చిరున‌వ్వును ప్ర‌ద‌ర్శిస్తోంది. త‌న‌ను ఇంత ఆహ్లాదంగా మునుపెన్న‌డూ చూడ‌లేదు. అయితే త‌న ముఖంలో ఆ చిరున‌వ్వుకు కార‌ణం అభిమానుల అపార‌మైన ప్రేమాభిమానాలు. ఒక అభిమాని మిమ్మ‌ల్ని పెళ్లి చేసుకోవాలంటే ప్రొసీజ‌ర్ ఏమిటీ? అని ప్ర‌శ్నించ‌డ‌మే బ‌హుశా.. ఈ ఊహా ప్ర‌పంచ‌పు విహారానికి కార‌ణ‌మైందా? ఏమో.. సమంత‌నే స్వ‌యంగా చెబుతుందేమో చూడాలి.

స‌మంత షేర్ చేసిన ఫోటోలో ధ్యాన‌ముద్ర‌లో క‌నిపిస్తోంది. కళ్ళు మూసుకుని ప్ర‌శాంత వ‌ద‌నంతో కూర్చున్న ఆమె ముఖంపై నేరుగా సూర్య‌కిర‌ణాలు తాకగా ఒక తారాజువ్వ మెరుపును ఆవిష్క‌రించింది. ఈ ఫోటోలో నేపథ్యం అస్పష్టంగా ఉంది. ఆమె సోఫీ టక్కర్ రాసిన ఛేజింగ్ స్టార్స్ పాట లిరిక్ లైన్ ను ఈ ఫోటోకి వ్యాఖ్యగా జ‌త చేసింది. `ఫైండ్ ది లైట్` అనే వ్యాఖ్య‌ను జోడించింది. ఒక అభిమాని ``వెలుగు నీ లోపల ఉంది... నువ్వు మెరిసే నక్షత్రం`` అని పొగిడేయ‌గా... ఫుడ్ బ్లాగర్ ఆశ్రిత దగ్గుబాటి మెరిసే ఎమోజీలను జోడించారు.

నీకు కాంతి అవసరం లేదు...నువ్వు ప్రకాశవంతంగా ఉన్నావు! అని ఒక అభిమాని త‌న ప్రేమ‌ను కురిపించ‌గా..``నిద్ర నుండి మేల్కొన్నాను.. నేను మొదట చూసినది నిన్ను`` అని మ‌రో ఫ్యాన్ రాశాడు. మ‌రో వీరాభిమాని ``నిన్ను పెళ్లి చేసుకునే విధానం ఏమిటి?`` అని ఆస‌క్తిగా అడిగాడు. స‌మంత ఫోటోగ్రాఫ్ వీక్షించాక హార్ట్ ల‌వ్ ఈమోజీలు సోష‌ల్ మీడియ‌ల్లో పోటెత్తాయి. స‌మంత ప్ర‌స్తుతం సిటాడెల్ చిత్రీక‌ర‌ణ లో బిజీగా ఉంది. ఇది హిందీ - తెలుగు స‌హా అన్ని భాష‌ల‌లో విడుద‌ల‌య్యే సిరీస్. రాజ్ అండ్ డీకే క‌ర్త‌లు. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషీ చిత్రంలో న‌టించాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.