#సలార్.. పోగొట్టుకున్న చోటే రాబట్టాలని..!

Tue Aug 16 2022 08:00:01 GMT+0530 (IST)

Actress prabhas salaar movie news

సెంటిమెంటు పరిశ్రమలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే గట్స్ కావాలి. అలాంటి గట్స్ తమకు పుష్కలంగా ఉన్నాయని `సలార్` నిర్మాతలు నిరూపిస్తున్నారు. ఈ సినిమాకి తాజాగా రిలీజ్ తేదీని లాక్ చేసిన సంగతి తెలిసిందే. 2023 సెప్టెంబరు 28న సలార్ రిలీజవుతుందని ప్రకటించారు. ఆ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్.అయితే ఈ తేదీ గురించి ఆరాలు తీసిన అభిమానులు ఖంగు తిన్నారు. దీనిపై రకరకాల సందేహాలు పుట్టుకొచ్చాయి. నిజానికి ప్రభాస్ కి ఆ తేదీ ఒక పీడకలలాంటిది. అతడు నటించిన `రెబల్` అదే తేదీకి రిలీజై డిజాస్టర్ అయ్యింది. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ సినిమాని తెరకెక్కించిన లారెన్స్ మాస్టార్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది.

నిర్మాతతో తగువులు వచ్చాయి. రెబల్ నష్టాలను కూడా అతడు పూడ్చాల్సి వచ్చింది. అతడి కెరీర్ కి కూడా చాలా డ్యామేజ్ జరిగింది. మరి అలాంటి చెత్త రికార్డ్ ఉన్న తేదీని సలార్ కోసం ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనా?  సెంటిమెంట్ పరిశ్రమలో ఇలాంటి వాటిని ప్రత్యేకంగా తరచి చూడటం సహజం. కానీ సలార్ నిర్మాతలు గట్సీగా నిర్ణయం తీసుకున్నారు.

ఏదేమైనా ఫ్లాప్ ఎదురైన అదే రోజున `సలార్`ని విడుదల చేయడంపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అదే తేదీని ఎంపిక చేయడం వెనక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? అన్నది చిత్రబృందం వెల్లడించాల్సి ఉంటుంది.

అత్యంత భారీ కాన్వాస్ తో..!

కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ లో ప్రభాస్ ని ఏవిధంగా చూపించబోతున్నారు? అన్నది ఇంకా సస్పెన్స్ గా మారింది. ప్రభాస్ ఇందులో పూర్తి భిననంగా కనిపిస్తాడు. ఇందులో ద్విపాత్రాభినయంతో సర్ ప్రైజ్ చేస్తాడు. అతడి వేషధారణలు రక్తి కట్టిస్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ లుక్ చాలా ప్రత్యేకంగా కనిపించనుంది. అంతేకాదు.. ప్రభాస్ ఉపయోగించే వాహనాలు కూడా యూనిక్ స్టైల్లో అలరిస్తాయన్న టాక్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతోంది. సాలార్ లో ప్రభాస్ కోసం ప్రత్యేక కార్ ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేయించారట.

తన సినిమాల్లో హీరోల కోసం ప్రత్యేకంగా వాహనాలు డిజైన్ రూపొందించే అలవాటు ప్రశాంత్ నీల్ కి తొలి నుంచి ఉంది. KGF లో రాకీ భాయ్ కి వెరైటీ స్పోర్టీ లుక్ బైక్ ఉంది. ప్రశాంత్ `సలార్` కోసం కూడా అలాంటిదే డిజైన్ చేయిస్తున్నాడట. సలార్ లో ప్రభాస్ కఠినమైన గ్లింప్సీ స్పోర్టీ  లుక్ లో కనిపించే కారులో కనిపిస్తాడు. ఈ కారు లుక్ ని సస్పెన్స్ గా ఉంచి నేరుగా సినిమాలో ప్రదర్శిస్తారట. ఈ కార్ ని ప్రభాస్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అతను ఈ వాహనంలో ప్రయాణించేటప్పుడు మాస్ లుక్ లో కనిపిస్తాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కూడా ఇదే విషయంపై కొన్ని లీకులు ఇవ్వడం ప్రభాస్ అభిమానుల్లో ఎగ్జయిట్ మెంట్ పెంచుతోంది.

సలార్ లో ప్రభాస్ కోసం ఎంపిక చేసిన దుస్తులు కానీ మేకప్ కానీ లుక్ డిజైన్ కానీ ఆశ్చర్యపరుస్తాయి. ఇక సెట్స్ కానీ డార్క్ యాంబియెన్స్ ప్రత్యేక ముద్రను వేస్తాయని భావిస్తున్నారు. మాన్ స్టర్ కా బాప్ మాఫియా కింగ్ లా ప్రభాస్ ని చూపిస్తే చూడాలని అభిమానులు అంతే ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. దానికి తగ్గట్టే తాజా లీక్డ్ విషయాలపై కథనాలు వేడెక్కిస్తున్నాయి. సలార్ చిత్రం 2023 సెప్టెంబర్ లో విడుదల కానుంది.