Begin typing your search above and press return to search.
సీనియర్ హీరోయిన్ కి సీనియర్ హీరో అంటిస్తాడా?
By: Tupaki Desk | 21 March 2023 8:00 AMపెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్లుగా ఏల్తున్నారు పలువురు కథానాయికలు. కరీనా కపూర్ ఖాన్- కత్రిన అందుకు ఎగ్జాంపుల్. టాలీవుడ్ లో సమంత పెళ్లి తర్వాత అద్భుతంగా రాణించారు. కానీ చందమామ కాజల్ కెరీర్ అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మణిరత్నం పీఎస్ 1 విజయంతో ఐశ్వర్యారాయ్ ట్రాక్ లోకి వచ్చేసింది. ఇక వీళ్ల బాటలోనే కాజల్ గ్రేట్ కంబ్యాక్ ని ఆశిస్తోంది. గౌతమ్ కిచ్లుతో వివాహానంతరం ఒక బిడ్డను కూడా కన్న కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో రైజింగ్ కోసం చాలా తాపత్రయ పడుతోంది. కానీ ఇటీవలే విడుదలైన తమిళ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఇది ఊహించని పంచ్.
ఇక పెళ్లి సమయంలో మెగాస్టార్ `ఆచార్య` సినిమాలో నటించినా అది ఎంతమాత్రం తనకు కలిసి రాని సంగతి తెలిసినదే. వరుసగా రెండు వైఫల్యాలు ఇబ్బందికరమే. ఇలాంటి సమయంలో ఇప్పుడు నటసింహా నందమూరి బాలకృష్ణ సరసన నటించేందుకు కాజల్ సంతకం చేయడం ఆసక్తికరం. దశాబ్ధంన్నర కెరీర్ లో ఎన్నడూ ఎన్బీకే సరసన నటించని కాజల్ కి ఇది అరుదైన అవకాశం. టైమింగ్ లీ ఆదుకునే లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. స్టార్ హీరోయిన్ గా తన హోదాని నిలబెట్టుకునేందుకు ఇదే చివరి అవకాశం అని కూడా అనుకోవాలేమో! అంతగా మ్యారీడ్ బ్యూటీ కాజల్ ని జనం ఇటీవల ఆదమరిచారు.
అయితే తనకో గ్రేట్ కంబ్యాక్ కావాలి. ఆ ఒక్క ఛాన్స్ బాలయ్యతో కుదిరింది. హిట్టు కోసం ఉవ్విళ్లూరుతున్న ఇలాంటి సమయంలో బాలయ్య బాబు ఛరిష్మా ఉపయోగపడుతుందని కాజల్ ఆశిస్తోంది. అసలే బాలయ్య వరుస హిట్లతో దూకుడు మీదున్నాడు.. పెద్ద తెర - ఓటీటీ (బుల్లితెర) అన్నిటినీ ఏలేస్తున్నాడు. అతడి గోల్డెన్ హ్యాండ్ కాజల్ కి బిగ్ బూస్ట్ గా మారుతుందనే ఆశిద్దాం. #NBK108 కి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఎన్బీకే సరసన కాజల్ ని లాక్ చేసిన ఘనాపాటిగా అనీల్ రావిపూడికి కూడా గుర్తింపు దక్కనుంది. ఈ చిత్రంలోనే యువనాయిక శ్రీలీల ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతానికి సీనియర్ హీరోయిన్ కి సీనియర్ హీరో ఏ మేరకు తన అదృష్టాన్ని అంటిస్తాడో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.