పింక్ గౌనులో హనీరోజ్ అందాలు.. కష్టమే బాబోయ్!

Mon Mar 20 2023 05:00:01 GMT+0530 (India Standard Time)

Actress honey rose glamours video

మలయాళ సినీ పరిశ్రమకు చెందిన హనీరోజ్ ఈ మధ్యకాలంలో వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ క్రేజ్ అందుకుంది. వాస్తవానికి ఆమె ఇప్పట్లో కాదు అప్పుడెప్పుడో 2008లోనే ఆలయం అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా లాంచ్ అయింది. కానీ అసలు ఏ మాత్రం ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఎక్కువగా మలయాళ కన్నడ తమిళ సినీ పరిశ్రమకు పరిమితమైన ఆమె 2014లో ఈ వర్షం సాక్షిగా అనే మరో సినిమా కూడా చేసింది.అయితే ఈ సినిమా కూడా ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదు. అయితే 2023 మొదట్లో బాలకృష్ణ హీరోగా హనీరోజ్ హీరోయిన్ గా వీరసింహారెడ్డి సినిమా రూపొందింది. వాస్తవానికి ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ అని ముందు నుంచి ప్రచారం చేశారు. కానీ హనీరోజ్ కూడా ఒకానొక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా చేసిన తర్వాత ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోవటమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆమెకు చాలామంది అభిమానులుగా మారిపోయారు.

ఇక తన క్రేజ్ ని వాడుకునేందుకు సిద్ధమైన ఈ భామ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. కేరళలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా షాప్ ఓపెనింగ్స్ అలాగే పలు ఈవెంట్లో మెరుస్తూ అక్కడికి ఆమె ధరించిన బట్టలను చాలా తెలివిగా పబ్లిసిటీ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఆమె జిగేలుమంటున్న పింక్ కలర్ గౌన్ లో మెరుస్తూ ఒక వీడియో షేర్ చేసింది.

ఆమె షేర్ చేసిన కొద్దిసేపటికి ఈ వీడియో మీద లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. అభిమానులు ఆమె మలయాళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఇండియన్ కింగ్ కర్దాషియన్ లో ఉందంటూ ఒక అభిమాని అయితే తన అభిమానాన్ని బయట పెట్టుకున్నాడు. ఇక ఈ డ్రెస్ లో ఫ్రెంట్ బ్యాక్ అందాలన్నీ కనిపించేలా ఈ భామ సందడి చేస్తోంది. చేతిలో వాటర్ మిలన్ జ్యూస్ తీసుకుంటూ కోయలు పలికిస్తూ నడుస్తూ వస్తోంది. ఇక ఆ అభిమానులు అందరూ రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.