అందుకే చిరుని అందరి వాడు అనేది!

Fri Sep 30 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Actress chiranjeevi movie news

ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్స్ వన్నా మెగాస్టార్ మెగాస్టారే అని మరో సారి నిరూపించారు. ఈ మధ్య చిన్న సినిమాలకు అండగా నిలుస్తూ వారికి తన వంతు సపోర్ట్ ని అందిస్తున్నారాయన. ప్రీ రిలీజ్ ఈవెంట్ లలోనూ దర్శనమిస్తూ చిన్న సినిమాలకు అండగా నిలుస్తున్నారు. అయితే తాజాగా ఓ చిన్న సినిమా విషయంలోనూ తన పెద్ద మనసుని చూపించి అందరిని ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 5న దసరా సందర్భంగా రెండు భారీ సినిమాలు ఓ చిన్న సినిమా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి నటించిన `గాడ్ ఫాదర్` కింగ్ నాగార్జున `ది ఘోస్ట్` యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న `స్వాతిముత్యం`..ఈ మూడు సినిమాలు అక్టోబర్ 5న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోకరుగా సాగుతున్నాయి. కింగ్ నాగ్ నటించిన `ది ఘోస్ట్` టీజర్  ట్రైటర్ టెర్రిఫిక్ గా వుండటంతో ఈ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయింది.

ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే అక్టోబర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల కర్నూలులో జరిగింది. నాగార్జుతో పాటు అక్కినేని నాగచైతన్య అఖిల్ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున ..తన సినిమాతో పాటు అదే రోజు విడుదలవుతున్న చిరు సినిమా కూడా హిట్ కావాలన్నారు. అయితే `స్వాతిముత్యం` సినిమాని మర్చిపోయారు.

ఇదే సమయంలో మెగాస్టార్ నటించిన `గాడ్ ఫాదర్` మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంతపురంలో జరిగింది. చిరు మాట్లాడుతూ తన సినిమా విడుదలవుతున్న రోజునే నాగ్ `ది ఘోస్ట్` కూడా రిలీజ్ అవుతోందని అంతే కాకుండా యువ హీరో బెల్లంకొండ గణేష్ `స్వాతిముత్యం` కూడా రిలీజ్ అవుతోందని తన నసినిమాతో పాటు ఈ రెండు చిత్రాలని కూడా ఆదరించాలని కోరుకున్నారు. ఆ మాటలు విన్న వాళ్లంతా అందుకే చిరుని అందరి వాడు అనేది అని కామెంట్ లు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.