బోల్డ్ తమన్నా.. హీరోతో ప్రేమాయణం!

Sat Mar 18 2023 20:27:01 GMT+0530 (India Standard Time)

Actress Tamanna

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ్ హిందీ చిత్రాల్లో నటిస్తూ... నటిగా మోడల్ గా నృత్య కారణిగా కూడా మంచి గుర్తింపు పొందింది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె.. ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే తాజాగా తమన్నా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. లస్ట్ స్టోరీస్ 2లో బోల్డ్ గా కనిపించబోతుంది.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హైలెట్ కాని ఫీమేల్ సెక్యువాలిటీ టాపిక్ తో సాగే ఈ సిరీస్ కు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయింది. ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హైదరాబాదీ నటుడు విజయ్ వర్మ లీడ్ రోల్ లో కనిపించనున్నాడు.  అంతే కాకుండా ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న హీరోయిన్ తమన్నా బోల్డ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై పూర్తి స్పష్టత రాకపోయినప్పటికీ... ఆమె చాలా బోల్డ్ గా కనిపించబోతుందని తెలుస్తోంది.

మరోవైపు సిరీస్ లో నటిస్తున్న విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడినట్లు విపరీతమైన ప్రచారం కొనసాగింది. రెగ్యులర్ గా తమన్నా బాలీవుడ్ నైట్ పార్టీల్లో విజయ్ వర్మతో కలిసి కనిపిస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్లినా కూడా అతనితోనే కలిసి వెళ్తుంది. ఈ క్రమంలోనే విజయ్ వర్మతో తమన్నా పీకల్లోతు ప్రేమలో ఉందని టాక్. ఆ మధ్య వాలైంటైన్స్ డే సందర్భంగా విజయ్ వర్మ ఒక చెయ్యిని పోస్ట్ చేసి తన లవ్ ని తెలియజేశారు. ఆ చెయ్యి చూసిన తర్వాత అందరూ అది తమన్నా చెయ్యేనని ఫిక్స్ అయిపోయారు.

ఇప్పటి వరకు తమన్నా బోల్డ్ సీన్స్ లో కనిపించలేదు. మొదటి సారి ఈ వెబ్ సిరీస్ కి ఓకే చెప్పింది. బాయ్ ఫ్రెండ్ తో కాబట్టే ఇలాంటి సీన్స్ చేయడానికి ఓకే చెప్పిందని  అంతా అనుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది మాత్రం ఎవరికీ తెలియదు. దీనిపై చాలా మంది ప్రశ్నించినప్పటికీ.. ఆమె విషయం సరిగ్గా చెప్పట్లేదు. లస్ట్ స్టోరీస్ వెబ్ టీజర్ ట్రైలర్ వ్చే వరకు దీని గురించి ఏం తెలిసేలా లేదు.