ఫోటో స్టొరీ: ఇప్పటికీ హాటే.. డౌట్ లేదు

Tue Jul 16 2019 12:35:19 GMT+0530 (IST)

సీనియర్ హీరోయిన్ టబు గురించి పరిచయం అవసరమే లేదు.  అందం మాత్రమే కాకుండా అద్భుతమైన నటన కూడా ఆమె సొంతం. అటు బాలీవుడ్ నుండి ఇటు టాలీవుడ్ వరకూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన టబుకు ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.  టబు కెరీర్ లో ఒక క్లాసిక్ గా మిగిలిన చిత్రం అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన 'నిన్నే పెళ్లాడతా'.  1996 లో విడుదలైన ఆ సినిమాలో నాగ్ - టబు రొమాన్స్ అప్పట్లో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది.  ఆ జెనరేషన్ యూతు.. ఇప్పటికీ దాన్ని మర్చిపోలేరు!పాత విషయాలు పక్కనపెడితే టబు రీసెంట్ గా ఐదివా మ్యాగజైన్  లేటెస్ట్ ఎడిషన్ కోసం ఫోటో షూట్ చేసింది. విభిన్నమైన దుస్తులలో పోజులిచ్చింది.  ఈ జెనరేషన్ బ్యూటీలకు గట్టి పోటీ అన్నట్టుగా అందాల ప్రదర్శన కూడా చేసింది.  ఈ ఫోటోలు చూస్తే ఎవరు కూడా టబు వయసు 47 అనుకోరు.. అస్సలు అనుకోలేరు.  ముప్పైలలోనే ఆమె వయసు ముందుకు కదలకుండా మొరాయించిందా అన్నట్టుగా కనిపిస్తోంది.  కళ్ళలో ఆ ఇంటెన్సిటీ.. ఫేస్ లో గ్లో చూస్తుంటే టబు మాయలో పడిపోకుండా ఉండలేరు.  

టబు లాస్ట్ ఇయర్ 'అంధా ధున్' చిత్రంలో అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హిందీలో టబు అడపాదడపా నటిస్తున్నప్పటికీ తెలుగు సినిమాల్లో మాత్రం చాలారోజుల తర్వాత కనిపించనుంది.  అల్లు అర్జున్ - త్రివిక్రమ్ చిత్రంలోనూ..  రానా సాయిపల్లవి చిత్రం 'విరాటపర్వం' లోనూ టబు కీలకపాత్రలు పోషిస్తోంది.