Begin typing your search above and press return to search.

7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

By:  Tupaki Desk   |   28 Jan 2023 1:00 PM GMT
7G బృందావన కాలనీ.. హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
X
7G బృందావన్ కాలనీ సినిమాని చాలా మంది చూసే ఉంటారు. ఆ సినిమా గురించి తెలియని వారు ఉండరనే చెప్పాలి. 2004లో వచ్చిన ఈ సినిమా ఆ టైమ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవితో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న ఎఎంరత్నం తనయుడే రవికృష్ణ. ఇక ఆ సినిమాలో రవికృష్ణకి జోడీగా సోనియా అగర్వాల్ నటించింది. ఆ మూవీలో సోనియా అగర్వాల్ పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు.

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ చిత్రంగా ఉంటుంది. ఇప్పుడు చూసిన కంటెంట్ రీఫ్రెష్ గా ఉంటుంది. ప్రేమకథని ఎంతో అద్బుతంగా ఈ సినిమాలో దర్శకుడు ఆవిష్కరించాడు. ఇక ఈ సినిమాతో సోనియా అగర్వాల్ కూడా స్టార్ అయిపొయింది. తరువాత ఆ సినిమా దర్శకుడు సెల్వ రాఘవన్ ని ని సోనియా అగర్వాల్ పెళ్లి చేసుకుంది. బృందావన్ కాలనీ కంటే ముందుగానే ఆమె తెలుగులో జగపతిబాబుకి జోడీగా దమ్ అనే సినిమాలో అలాగే విజయ్, శింబుకి జోడీగా నటించింది.

ఓ విధంగా చెప్పాలంటే తమిళంలో అప్పటికే ఆమె మంచి ఫేం సంపాదించుకుంది. వీటి తర్వాత వచ్చిన 7జీ బృందావన్ కాలనీ ఆమెకి ఊహించని హైప్ తీసుకొచ్చింది. తరువాత తమిళంలో భాగానే అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయిన తమిళంలో మాత్రం సక్సెస్ అయ్యింది. అలాగే మలయాళం, కన్నడ సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించింది. 2006లో సెల్వ రాఘవన్ ని పెళ్లి చేసుకున్న సోనియా అగర్వాల్ 2010లో అతనితో విడిపోయింది.

ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఆమె తెలుగులో చివరిగా రామ్ హీరోగా తెరకెక్కిన రెడ్ సినిమాలో నటించింది. తమిళంలో ఆమె నటించిన మూడు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సోనియా అగర్వాల్ కి ప్రస్తుతం భాగానే అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం ఎలా ఉంది అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండటంతో ఆమెపై ఎవరూ అంతగా ఫోకస్ చేయరు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ స్లిమ్ అయిపోయి కుర్ర హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో మెరిసిపోతుంది. ఆమె రూపాన్ని మీరు కూడా ఓ సారి చూసి తీరాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.