Begin typing your search above and press return to search.

తెలుగు చీరలో నడుము అందం చూపిస్తోన్న ముద్దుగుమ్మ

By:  Tupaki Desk   |   27 May 2023 5:21 PM GMT
తెలుగు చీరలో నడుము అందం చూపిస్తోన్న ముద్దుగుమ్మ
X
తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ ముంబైలో మోడలింగ్ తో తన సినీ కెరీర్‌ ను మొదలు పెట్టి ఆ తర్వాత అక్కడే నటిగా కూడా మెప్పించింది. అక్కడ మంచి పేరు దక్కించుకున్న తర్వాత ఇప్పుడు శోభిత దూళిపాళ టాలీవుడ్‌ లో మరియు కోలీవుడ్‌ లో వరుసగా సినిమాల్లో నటిస్తోంది.

తాజాగా పొన్నియన్ సెల్వన్‌ సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు తెలుగు లో మరోసారి గూఢచారి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మొత్తానికి ఇండస్ట్రీ లో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత చేస్తూ అలరిస్తోంది.

సోషల్‌ మీడియాలో ఈమె షేర్‌ చేస్తున్న పోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల విందు ఆకట్టుకుంది. ఈసారి చీర కట్టులో నడుము అందం చూపిస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చి సర్‌ ప్రైజ్ చేసింది. చీర కట్టు లో మరింత అందంగా శోభిత కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఈ అమ్మడి వ్యక్తిగత విషయానికి వస్తే గత కొన్నాళ్లుగా ఈ అమ్మడు నాగ చైతన్య తో ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. పుకార్లే అంటూ పలు సార్లు చెప్పినా కూడా కొన్ని ఫోటోలు ఇద్దరు ప్రేమలో ఉన్నారేమో అనిపించేలా సాక్ష్యంగా ఉన్నాయి.