వర్మ పంపిన షాకింగ్ వీడియో చెప్పిన నటి

Mon Aug 19 2019 12:29:45 GMT+0530 (IST)

Actress Sherlyn Chopra Accuses Ram Gopal Varma

హాట్ నటిగా సుపరిచితురాలు హైదరాబాదీ అందాల బాంబ్ షెర్లిన్ చోప్రా. మోడల్ గా నటిగా పేరున్న ఆమె కామసూత్ర మూవీలో నగ్నంగా నటించినా ఆ సినిమా ఆమెకు ఎలాంటి లాభం చేకూర్చలేకపోయింది. తన పేరుతో స్టార్ట్ చేసిన యాప్ లో తన వీడియోల్ని పోస్ట్ చేయటం అమ్మడికి అలవాటు. మసాలా ఫుల్ గా ఉండే ఈ వీడియోలతో తరచూ వార్తల్లోకి ఎక్కే ఈ భామ తాజాగా షాకింగ్ అంశాన్ని చెప్పుకొచ్చింది.ప్రముఖ దర్శకుడు.. వివాదాలతో చెట్టాపట్టాలేసుకు తిరిగే రాంగోపాల్ వర్మ తనకు పంపిన ఒక షాకింగ్ వీడియో గురించి ఆమె వెల్లడించింది. వర్మ చేసే సినిమాలో అవకాశం ఇస్తారన్న ఆశతో తాను ఆయనకు వాట్సాప్ లో తన పిక్స్ .. ప్రొఫైల్ పంపినట్లుగా ఆమె చెప్పారు. 2016లో వర్మకు తన వివరాలు పంపానని.. ఆయన చేస్తున్న ప్రాజెక్టు గురించి వివరాలు అడిగినట్లు చెప్పారు. ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలంటే తనకు ఇష్టమని కూడా చెప్పినట్లు తెలిపారు.

వర్మ నుంచి రిప్లై వచ్చిందని.. తాను పంపిన స్క్రిప్ట్ చదివి నీ అభిప్రాయం చెప్పమన్నారని షెర్లిన్ వివరించింది. అయితే.. అందులో స్టోరీయే లేదని.. సెక్స్ సీన్లు తప్పించి మరింకేమీ లేదని.. కథ గురించి తెలుసుకోవచ్చా? అని తాను మెసేజ్ పంపితో.. తాను పంపిందే కథ అని సమాధానం చెప్పినట్లుగా తెలిపారు.

ఏక్ థా రాజా ఏక్ థి రాణి అని టైటిల్ పెట్టి ఇందేంటి సార్?.. రాణితో రాజు సెక్స్ చేశాడు.. అంతేనా?  అక్కడితో కథ అయిపోయింది.. ఇందే కథ? అని తాను అడగ్గా..  ఒక షాకింగ్ వీడియోను పంపినట్లు చెప్పారు. కుక్క మహిళతో సెక్స్ చేస్తున్న అశ్లీల వీడియోను తనకు పంపారన్నారు. ఎందుకిలా అని అడిగితే.. సెక్స్ అనేది సాధారణ అవసరమని తెలియజెప్పటమే తన ఉద్దేశంగా చెప్పారన్నారు. సెక్స్ అనేది మనుషులకైనా పశువులకైనా కావాల్సిందేనని.. కాబట్టి దాన్నే కోరుకో.. ఎంజాయ్ చేయ్ అని బదులిచ్చినట్లుగా తెలిపారు.

మరి.. ఇలాంటి పని చేసినందుకు వర్మ మీద కేసు ఎందుకు పెట్టలేదన్న ప్రశ్నకు షర్లిన్ సమాధానం ఇస్తూ.. ఆయన వీడియో పంపారే కానీ.. తన సినిమాలో నటించమని ఒత్తిడి చేయలేదని.. అందుకే సైబర్ క్రైంలో కంప్లైంట్ చేయలేదని సమాధానం ఇచ్చారు. వర్మ వ్యవహారంపై షెర్లిన్ ఓపెన్ కావటం.. షాకింగ్ వీడియో ఉదంతాన్ని చెప్పిన నేపథ్యంలో దీనికి వివాదాల దర్శకుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.