#బికినీ ట్రీట్! పెళ్లయి కూతురు పుట్టాకా తగ్గేదేలే!!

Tue Feb 07 2023 22:28:17 GMT+0530 (India Standard Time)

Actress Sayyesha Saigal latest pic

తమిళ హీరో ఆర్య .. బాలీవుడ్ యువనటి సయేషా సైగల్ ప్రేమించి పెళ్లి  చేసుకున్న సంగతి తెలిసిందే. 2019 మార్చిలో పెళ్లితో దాంప్యత జీవితంలోకి అడుగు పెట్టారు. పెళ్లికి ముందు ఈ జంట కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. సయేషా సైగల్ బాలీవుడ్ అమ్మాయి. హిందీ నటి షాహీన్ భాను కుమార్తె. సౌత్ కుర్రాడు ఆర్యతో ప్రేమ పెళ్లికి ఇంట్లో వారిని ఒప్పించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆర్య ఎంతో ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి మనువాడాడు. ఈ జంటకు అరియానా అనే కూతురు ఉంది.ఐదేళ్ల ప్రేమైక జీవనం సంసారంలో సరిగమల్ని ఆస్వాధిస్తున్న సయేషా తిరిగి ముఖానికి రంగేసుకుని సినీ కెరీర్ పరంగా జోరు పెంచే ప్లాన్ లో ఉంది. మ్యారీడ్ బ్యూటీస్ కి టాలీవుడ్ ఎలాగూ అవకాశాలివ్వదు కాబట్టి  సయేషా  కోలీవుడ్  శాండల్వుడ్ పై దృష్టి పెట్టిందని టాక్ వినిపించింది. వివాహానంతరం కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సరసన యువరత్న అనే సినిమాలో నటించింది. పెళ్లి తర్వాత తనకు కన్నడంలో డెబ్యూ మూవీ అది. అలాగే 2019లోనే సూర్య సరసనా తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలోను సయేషా నటించింది. ఆ తర్వాత భర్త ఆర్యతో కలిసి టెడ్డీ అనే ఆసక్తికర చిత్రంలోను నాయికగా నటించింది.

ఇటీవలే ఆన్ లొకేషన్ మేకప్ సెషన్స్ నుంచి మరో ఫోటోని సయేషా ఇన్ స్టాలో షేర్ చేయగా ఇంకా నటిగా కొనసాగుతోందని అర్థమైంది. తాజాగా సయేషా పూల్ సైడ్ బికినీ ట్రీట్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లయి కూతురు పుట్టినా మ్యారీడ్ సయేషా అందంగా...ఆకర్షణీయంగా కనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకా అదే టీనేజీ మెరుపులతో మేలిమి ఛాయతో తళతళలాడుతోందని పొగిడేస్తున్నారు.

పెళ్లికి ముందు సన్న జాజిలా ఉండే సయేషా ఇటీవల చబ్బీగా మారిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇంతలోనే జిమ్ లో కసరత్తులతో టోన్డ్ ఫిజిక్ ని సంపాదించింది. తాజా ఫోటోలు అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా మారాయి. పూల్ సైడ్ అలా ఈత ముగించుకుని ఇలా సెల్ఫీ దిగింది. ఎల్లో కలర్ ఈత దుస్తుల్లో సయేషా టూ హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.