Begin typing your search above and press return to search.

ఒకప్పటి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.?

By:  Tupaki Desk   |   7 Jun 2023 4:00 PM GMT
ఒకప్పటి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.?
X
తెలుగు రాష్ట్రాలతో, అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీ తో ఏమాత్రం సంబంధం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సినీ ప్రేక్షకుల మదిని దోచుకున్న నటీనటులు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే 2010వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని మరియు దర్శకుడు తాతినేని సత్య తదితరుల కాంభినేషన్ లో తెరకెక్కిన భీమిలి కబడ్డీ జట్టు ఇప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులను కట్టి పడేసిన బ్యూటిఫుల్ మలయాళీ హీరోయిన్ శరణ్య మోహన్ కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు. అయితే నటి శరణ్య మోహన్ ఈ చిత్రంలో కనిపించిది తక్కువ సమయమే అయినప్పటికి తన అందం, కట్టు, బొట్టు, అభినయంతో మతి పోగొట్టింది.

ఈ చిత్రం శరణ్య మోహన్ కి మంచి ఆఫర్లు తలుపు తట్టినప్పటికి కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడం, అలాగే తెలుగు సినీ పరిశ్రమపై పెద్దగా దృష్టి సారించక పోవడం వంటివాటి కారణంగా పెద్దగా క్లిక్ కాలేక పోయింది. దీంతో కొంతకాలం తర్వాత ఈ అమ్మడి కెరియర్ చప్పగా సాగింది. దాంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించింది.

ఈ క్రమంలో తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా అరవింద్ కృష్ణన్ డాక్టర్ వృత్తి చేపట్టి బాగానే సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం శరణ్య మోహన్ కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఐతే పెళ్లయిన తర్వాత నటి శరణ్య మోహన్ కుటుంబ భాధ్యతలు చక్కబెట్టే పనిలో పడటంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీకి సమయం కేటాయించ లేకపోయింది.

కాగా ప్రస్తుతం తన పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ ఇంటి పట్టునే ఉంటోంది. కానీ సోషల్ మీడియా లో మాత్రం బాగానే యాక్టిివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ తనకు సంబందించిన ఫోటోలు, తన పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు, ఫన్నీ వీడయోలు వంటివి షేర్ చేస్తూ ఉంటోంది.

దీంతో చాలామంది ఫ్యాన్స్ సినిమా ఇండస్ట్రీ కి మళ్ళీ రీ ఎంట్రీ ఎప్పుడని అడుగుతున్నా శరణ్య మోహన్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ విషయం ఇలా ఉండగా నటి శరణ్య మోహన్ తెలుగులో విలేజ్ లో వినాయకుడు, కళ్యాణ్ రామ్ కత్తి, భీమిలి కబడ్డీ జట్టు, హ్యాపీ హ్యాపీగా తదితర చిత్రాల్లో నటించింది. ఇక తమిళ్, కన్నడ తదితర భాషలలో కూడా దాదాపుగా 15కి పైగా చిత్రాల్లో నటించింది.