బాలీవుడ్ భామలను సమంత భయపెట్టేస్తుందే!

Sun Sep 25 2022 18:27:29 GMT+0530 (India Standard Time)

Actress Samantha In Bollywood

చూడటానికి సమంత చాలా అమాయకంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. అలాంటి సమంత కెరియర్ గ్రాఫ్ చూస్తే ఆమెలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువనే అనే విషయం అర్థమవుతుంది. లేకపోతే ఎలాంటి నేపథ్యం లేకుండా ఆమె ఇంత దూరం ఎగరలేదు .. ఇంత ఎత్తుకు ఎదగలేదు. కెరియర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలను చేస్తూ అల్లరిపిల్లగా అలరించిన సమంత ఆ తరువాత నటన ప్రధానమైన పాత్రలలోను మెప్పిస్తూ వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ అనిపించుకుంది.చైతూతో పెళ్లి తరువాత కూడా ఆమె సోషల్ మీడియాలో అదే జోరును కొనసాగించింది. సినిమాల పరంగా కూడా ఆమె ఎంతమాత్రం వెనక్కి తగ్గింది లేదు. చైతూతో విడాకులకు కారణం ఆమె చేసిన వెబ్ సిరీస్ ల లోని పాత్రలేననే టాక్ బలంగా ఉంది. ఇక ఆమె బాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టనుందనే ప్రచారం విడాకుల ముందునుంచే మొదలైంది. అనుకున్నట్టుగానే ఆమె ఆ తరువాత బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెడుతోంది. మరో వైపున భారీ బడ్జెట్ తో కూడిన వెబ్ సిరీస్ ల తోను బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె ఊపిరి సలపనంత బిజీ.

చైతూతో విడాకుల తరువాత సమంత గ్రాఫ్ పడిపోవడం ఖాయమని చాలామంది అనుకున్నారు. తాను చాలా డిప్రెషన్ లో ఉన్నట్టుగా సమంత చెబుతున్న మాటలు విని మిగతావాళ్లు కూడా అదే అనుకున్నారు. కానీ సమంత ఒక్కసారిగా తన దూకుడు పెంచింది. మరింత  ఫాస్టుగా ముందుకు దూసుకువెళ్లడం మొదలుపెట్టింది. బోల్డ్ గా కనిపించడానికి కూడా ఆమె వెనుకాడకపోవడం కూడా ఇందుకు కారణమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన ఒక సర్వేలో జాతీయ స్థాయిలో ఆమె నెంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం.

జాతీయ స్థాయిలో రాణిస్తున్న టాప్ టెన్ హీరోయిన్స్ ఎవరనే ఒక సర్వేను నిర్వహించగా ఆ పదిమంది కథానాయికల జాబితాలో సమంత పేరు మొదటి స్థానంలో కనిపించడం విశేషం. మిగతా స్థానాలలో వరుసగా అలియా భట్ .. నయనతార .. కాజల్ .. దీపికా పదుకొణె .. రష్మిక .. కీర్తి సురేశ్  .. కత్రినా .. పూజ హెగ్డే .. అనుష్క నిలిచారు. బాలీవుడ్ లో చక్రం తిప్పేస్తున్న భామలను ఈ సర్వే భయపెడుతోందని టాక్.  సమంత నుంచి పాన్ ఇండియా సినిమాగా 'శాకుంతలం' విడుదలైతే బాలీవుడ్లో ఆమె మరింత బలంగా పాతుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.