వింత వ్యాధి గురించి బయటపెట్టిన హీరోయిన్

Fri Jul 01 2022 06:00:01 GMT+0530 (IST)

Actress Revealed about a strange disease

సినిమా రంగంలో నటీనటులు పైకి ఎంత స్టార్స్ హోదా తో కనిపించినా కూడా తెర వెనుక వారు కూడా అందరీలనే కొన్ని సమస్యలను తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి ఎంత డబ్బులు ఉన్నా కూడా నయం చేయలేని జబ్బులు వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.  అలాగే ఇటీవల ఒక హీరోయిన్ తన దీర్ఘకాలిక వ్యాధి గురించి చెప్పుకుని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దని ఒక వివరణ అయితే ఇచ్చింది.ఇష్క్ విష్క్' 'ఢిల్లీ బెల్లీ' సినిమాలతో బాలీవుడ్ లో గుర్తింపు పొందిన నటి  షెనాజ్ ట్రెజరీ తన వ్యాధి గురించి సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ 40 ఏళ్ల నటి ప్రోసోపాగ్నోసియా అనే వ్యాధితో  ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అది ఎలాంటి వ్యాధి అంటే ఎవరైనా వ్యక్తిని కొత్తగా కలిసినప్పుడు ఆ తర్వాత మళ్లీ అతన్ని గుర్తుపట్టలేనంతగా ఉంటుంది అని కొన్నిసార్లు తరచుగా కలిసే వ్యక్తిని కూడా చాలా ఈజీగా మర్చిపోతూ ఉంటాను అని ఈ బ్యూటీ తెలియజేసింది.

ఇక ఈ వ్యాధి కారణంగా మనుషులను చాలాసార్లు గుర్తుపట్టలేని సమయంలో ఎదుటివారు తనకు పొగరు అని అనుకున్నారు అని కొన్నిసార్లు అయితే మొహం మీదే ఆ విషయాన్ని కూడా చెప్పినట్లుగా తెలియజేసింది.

కానీ నా పరిస్థితి గురించి వారికి వివరణ ఇచ్చేవరకు అర్థమయ్యేది కాదని ఈ విషయంలో కొన్నిసార్లు నేను మానసికంగా ఆందోళన కూడా చెందానని షెనాజ్ ట్రెజరీ పేర్కొంది.

మొదట నేను ఇలా ఎందుకు జరుగుతుంది అని వైద్యులను అడిగినప్పుడు కొన్ని పరీక్షలు చేసిన అనంతరం వ్యాధి గురించి బయటపడినట్లుగా ఈ బ్యూటీ తెలియజేసింది.

మెదడుకు సంబంధించిన ఈ వ్యాధి కొంతమంది ముఖాలను గుర్తుపట్టలేని విధంగా చేస్తుందని అయితే వారి హెయిర్ స్టైల్ చూసి గుర్తు పట్టే విధంగా మాత్రం అవకాశం ఉంటుంది అని వివరణ ఇచ్చింది. అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వ్యక్తి తన హెయిర్ స్టైల్ మార్చుకుంటే మాత్రం మళ్ళీ మర్చిపోతాను అని కూడా షెనాజ్ ట్రెజరీ తెలియజేసింది.