Begin typing your search above and press return to search.

మాజీ ప్రియుడి టాట్టూని తొల‌గించుకుని దొరికిపోయిన న‌టి

By:  Tupaki Desk   |   4 Dec 2020 11:30 PM GMT
మాజీ ప్రియుడి టాట్టూని తొల‌గించుకుని దొరికిపోయిన న‌టి
X
మ‌న క‌థానాయిక‌ల‌కు టాట్టూ క‌ల్చ‌ర్ కొత్తేమీ కాదు. ముఖ్యంగా ప్రేయ‌సి ప్రియుడికి ఇచ్చే ప్రేమ‌కానుక‌గా టాట్టూ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకోవ‌డంతో దానిని ఫాలో అయ్యే క‌థానాయిక‌ల‌కు కొద‌వేమీ లేదు. స్టార్ హీరోయిన్ ‌లు తాము ప్రేమించిన వారి పేర్ల‌ని టాటూలుగా త‌మ శ‌రీర భాగాల‌పై వేయించుకోవ‌డం తెలిసిందే. ఈ ట్రెండ్ కొత్త‌గా మొద‌లైంది కాదు.. గ‌త కొన్నేళ్లుగా జ‌రుగుతున్న‌దే.

ప్ర‌భుదేవాతో ప్రేమాయ‌ణం న‌డిపించిన స‌మ‌యంలో న‌య‌న‌తార అత‌ని పేరుని టాటూగా వేయించుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అదే త‌ర‌హాలో ర‌ణ్ ‌బీర్ కపూర్ ‌తో డేటింగ్ లో వున్న స‌మ‌యంలో దీపికా ప‌దుకునే త‌న మెడ‌పై ఆర్కే అని టాటూ వేయించుకుంది.

ఇదే త‌ర‌హాలో టాలీవుడ్ కు చెందిన ఓ యువ న‌టి త‌న శ‌రీర భాగాల‌పై టాట్టూ పొడిపించుకుంది. అయితే ఆ టాటూలో ఆమె మాజీ ప్రియుడి పేరు తొలి అక్ష‌రం కూడా వుండ‌టం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌లే అత‌ని నుంచి విడిపోయింది. ప్ర‌స్తుతం స‌ద‌రు ప్రియుడు ఆమెని త‌న ద‌రిదాపుల్లోకి కూడా రానివ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదట‌.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆ యువ‌న‌టి త‌న మాజీ ప్రియుడికి సంబంధించిన టాటూని కూడా తొల‌గించుకుంది‌. దీంతో అస‌లు వ్య‌వ‌హారం బ‌య‌టికి వ‌చ్చింది. దీంతో అంతా అవాక్క‌వుతున్నారు. మాజీ ప్రియుడి పేరు ప్లేస్ లో ఓ డిజైన‌ర్ సింబ‌ల్ ని న‌టి టాటూగా వేయించుకుంద‌ట‌.