బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న రష్మిక

Mon Mar 27 2023 21:56:52 GMT+0530 (India Standard Time)

Actress Rashmika Mandanna glamour show

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన సోషల్ మీడియాలో మోస్ట్ యూత్ క్రష్ గా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక సౌత్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న అందాలలో భామలలో కూడా రష్మిక టాప్ లో ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా ఈ అమ్మడు తన హవా కొనసాగిస్తుంది. ఇటు తెలుగులో పుష్ప 2 మూవీ అటు హిందీలో యానిమల్ సినిమాలు చేస్తుంది.ఈ రెండు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలు అనే సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో రష్మిక ఎక్కువగా బిటౌన్ లోనే సందడి చేస్తుంది. అలాగే బాలీవుడ్ ఫిల్మ్ సెలబ్రేషన్స్ అవార్డ్ ఈవెంట్స్ లో పాల్గొంటుంది. అక్కడ  తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో సందడి చేస్తుంది.

ఈ విధంగా బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో ఈ అమ్మడు పడేందుకు ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పాలి. అదే సమయంలో గ్లామర్ షో పరంగా కూడా సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తూ ఉంటుంది. ఇక ఆమె ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయనే సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు మరోసారి ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలతో మెస్మరైజ్ చేసింది. బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాగ్ లో ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేసే లుక్స్ తో కట్టిపడేస్తుంది. ఈ ఫోటోలని ఏకంగా 4.43 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం. అయితే ఈ ఫోటోలలో ఆమె లుక్ కాస్తా డిఫరెంట్ గా కనిపిస్తుంది.

పెదవులలో మునుపటి అందం అయితే లేదు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందేమో అనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె తెలుగులో నితిన్ కి జోడీగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యింది. ఈ మూవీ లాంచింగ్ తాజాగా జరిగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.