Begin typing your search above and press return to search.

బ‌జార్ పేజీ పై బ్లేజ‌ర్ లో ర‌ష్మిక సెగ‌లు!

By:  Tupaki Desk   |   22 March 2023 5:14 PM GMT
బ‌జార్ పేజీ పై బ్లేజ‌ర్ లో ర‌ష్మిక సెగ‌లు!
X
నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న టెంప్టింగ్ ఎలివేష‌న్లు ఏ రేంజ్ లో కాక పుట్టిస్తాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆల్ర్టా మోడ్ర‌న్ దుస్తుల్లో అగ్గిరాజేసే అందాల‌తో కుర్రాళ్ల‌ని హీటెక్కించ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత సొగ‌స‌రి ఎలివేష‌న్ ప్రాస‌ప్ లో ఇంకా మార్పులొచ్చాయి. అక్క‌డి క‌ల్చ‌ర్ కి త‌గ్గ‌ట్టు మౌల్డ్ అయి బాలీవుడ్ భామ‌ల‌కే స‌వాల్ గా మారింది. ట్రెండీ దుస్తుల్లో తుఫాన్ లా విర‌చుకుప‌డుతుంది.

ఎలాంటి వేర్ అయినా? న‌వ‌ర‌సాలు పండాల్సిందే అన్నంత‌గా ఫోక‌స్ అవుతుంది. అవ‌స‌ర‌మైన వేళ క‌వ‌ర్ పేజీల‌కు ఫోజులివ్వ‌డంలోనూ ఏమాత్రం త‌గ్గ‌లేదు. అంది వ‌చ్చిన అవ‌కాశంపై త‌న‌దైన మార్క్ వేస్తుంది. తాజాగా బ‌జార్ ఇండియా క‌వ‌ర్ పేజీపై బ్లేజ‌ర్ దుస్తుల్లో అమ్మ‌డు అంతే అందంగా క‌నిపిస్తుంది.

వైట్ అండ్ వైట్ లో వైట్ బ్యాక్ డ్రాప్ లో ఇచ్చిన ఫోజులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. యారాగెంట్ లుక్ లో ర‌ష్మిక మ‌త్తెక్కించే వైనం ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అభిమానులంతా త‌మదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇక అమ్మ‌డి కెరీర్ సంగ‌తి చూస్తే బాలీవుడ్ లో నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇప్ప‌టికే రెండు సినిమాలు చేసింది. కానీ అవి రెండు ఆశించిన ఫ‌లితావ్వ‌లేదు. ప్ర‌స్తుతం రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న `యానిమ‌ల్` చిత్రంలో న‌టిస్తోంది. ఇంకా కొత్త అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

ఇటు తెలుగులో `పుష్ప‌-2`లో న‌టిస్తోంది. ఈ సినిమా సెట్స్ లో ఉంది. కొత్త అవ‌కాశాలు వ‌స్తున్నా బాలీవుడ్ లో బిజీ అయ్యే ప్లాన్ లో భాగంగా వాటిని హోల్డ్ లో పెడుతుంది. ఈ ఏడాది ఆ రెండు సినిమా లతోనే గ‌డిపేలా ఉంది. ఇప్ప‌టికే `పుష్ప‌`తో పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయింది. శ్రీవ‌ల్లి పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైన సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.