ఫోటో స్టోరీ : గ్లామర్ డోస్ పెంచిన అందాల రాశి..!

Sun Mar 19 2023 17:35:26 GMT+0530 (India Standard Time)

Actress Rashi Khanna latest pic

స్టార్ హీరోయిన్ రేంజ్ కు రీచ్ కాలేదు కానీ తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలిచిన హీరోయిన్ గా రాశి ఖన్నాకు సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు యువ హీరోలతో పాటు స్టార్స్ తో కూడా జత కడుతూ వస్తుంది. అయితే కెరీర్ లో సరైన టైం లో హిట్స్ లేక రిస్క్ లో పడింది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుస ప్రయత్నాలు చేస్తుంది రాశి ఖన్నా. అయినా కూడా అమ్మడికి టైం కలిసి రావట్లేదు.లాస్ట్ ఇయర్ తెలుగులో పక్కా కమర్షియల్ థ్యాంక్యు సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. అయితే తమిళ్ లో మాత్రం తిరు సినిమాతో హిట్ అందుకుంది రాశి ఖన్నా. అదే కాదు కార్తీతో చేసిన సర్దార్ సినిమతో కూడా సక్సెస్ అందుకుంది. కోలీవుడ్ లో హిట్ జోష్ కొనసాగిస్తున్న రాశి ప్రస్తుతం అక్కడే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇక సినిమాలతో పాటు లెక్క తగ్గకుండా ఫోటో షూట్స్ కూడా చేస్తుంది రాశి ఖన్నా.

ఈమధ్య గ్లామర్ డోస్ పెంచేసిన అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ లో వైట్ కలర్ బ్లేజర్ ధరించి టాప్ లేపేస్తుంది. ఎద అందాలు కనిపించేలా అమ్మడు చేస్తున్న ఈ గ్లామర్ అటెంప్ట్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. రాశిని ఈ యాంగిల్ లో ఎవరు ఎందుకు వాడుకోవట్లేదని డౌట్ రాక మానదు. రాశి ఖన్నా కూడా గ్లామర్ రోల్స్ కు తాను రెడీ అంటూ ఫోటో షూట్స్ తో హింట్ ఇస్తుంది.

హీరోయిన్స్ అంతా కూడా సినిమాలతో పాటు ఫోటో షూట్స్ కి ప్రియారిటీ ఇస్తున్నారు. తమని తాము ప్రమోట్ చేసుకునేందుకు ఈ ఫోటో షూట్స్ మంచి మాధ్యమాలుగా సిద్ధం చేస్తున్నారు. రాశి ఖన్నా మాత్రం సినిమాల కన్నా ఫోటో షూట్స్ తోనే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఎక్కువ అలరిస్తుంది. ఆమె ఫోటో షూట్ చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.