ఫోటో స్టోరీ: ప్రియాంక మోహన్..ట్రైబల్ గెటప్

Mon Jan 27 2020 15:26:12 GMT+0530 (IST)

Actress Priyanka Arul Mohan Stills From The Mayan Movie

'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ప్రియాంక మోహన్ కు పెద్దగా బ్రేక్ దక్కలేదు. సినిమా విడుదలకు ముందు ప్రియాంక మోహన్ గురించి ఆహా ఓహో అన్నారు కానీ సినిమా ఫ్లాప్ గా నిలవడంతో ప్రియాంకను టాలీవుడ్ మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదు. 'గ్యాంగ్ లీడర్' లో ప్రియాంక పాత్ర ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా ఉంటుంది. ఇది కూడా ప్రియాంకకు మైనస్ గా మారింది. ప్రియాంక ఈ విషయం గుర్తించిందేమో కానీ గ్లామరస్ ఫోటోషూట్లు చేస్తోంది. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నాలలో ఉంది.ప్రియాంక ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న 'డాక్టర్' అనే చిత్రం లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు 'ది మయన్' అనే మరో తమిళ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా కు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు కానీ ఈ సినిమా కథ మయన్ నాగరికత నాటి నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా హల్చల్ చేస్తోంది. ఈ పోస్టర్ లో ప్రియాంక మయన్ నాగరికతకు సంబంధించిన అమ్మాయి లాగా అప్పటి కట్టు బొట్టు తో కనిపిస్తోంది. మొహంపై పచ్చబొట్ల లాంటి డిజైన్ తో ట్రైబల్ అమ్మాయి లాగా కనిపిస్తోంది. శూలం తరహాలో కనిపించే ఒక ఆయుధం పట్టుకుని ఇంటెన్స్ లుక్ లో నిలుచుంది. గ్లామరస్ గా కూడా కనిపిస్తోంది.

ప్రియాంక వరస చూస్తుంటే తమిళంలో ఇంటెన్స్ పాత్రలు పోషిస్తూ బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. మన తెలుగు ఫిలిం మేకర్లు కూడా ఈ తపన ను గుర్తించి మంచి ఆఫర్లు ఎప్పుడు ఇస్తారో ఏమో వేచి చూడాలి.