Begin typing your search above and press return to search.

ట్రెడిషినల్ లుక్కులోనే ప్రణీత పాప క్లివేజ్ ట్రీట్

By:  Tupaki Desk   |   22 March 2023 8:00 AM GMT
ట్రెడిషినల్ లుక్కులోనే ప్రణీత పాప క్లివేజ్ ట్రీట్
X
భావ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ ప్రణీత శుభాష్. ఈ అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ మూవీ పోకిరి కన్నడ రీమేక్ లో ప్రణీత మాతృభాషలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస ఆఫర్స్ అందుకుంది.

ఇక తెలుగులో భావ మూవీ తర్వాత యంగ్ హీరోలకి జోడీగా నటిస్తూ వచ్చిన ఈ అమ్మడు అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా సెకండ్ హీరోయిన్ రోల్ లో నటించింది. తరువాత తారక్ కి జోడీగా రభస మూవీలో నటించి మెప్పించింది. ఆ తరువాత ఆశించిన అవకాశాలు తెలుగులో రాలేదని చెప్పాలి. అయితే కన్నడ నాట మాత్రం వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. హిందీలోకి కూడా అడుగుపెట్టిన అమ్మడు అక్కడొక మూవీ చేసింది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి రెండేళ్ళ క్రితం పెళ్లైంది. పెళ్లి తర్వాత కొంత సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. ఒక పాప కూడా పుట్టింది. అయితే తల్లి అయిన తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది.రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ షేర్ చేస్తుంది. అలాగే ఈ మధ్య వర్క్ అవుట్స్ చేసి మరల గ్లామర్ డోస్ కూడా పెంచింది. హీరోయిన్ గా తిరిగి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లుగా దర్శకులకి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

తాజాగా మరోసారి ట్రెడిషనల్ డ్రెస్సింగ్ లోనే ప్రణీత గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఎద అందాలు ఆరబోస్తూ వయ్యారాలు ఒలకబోసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ లుక్ లో అచ్చంగా యువరాణిలా ప్రణీత ఉందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తుంది. అలాగే లుక్ పరంగా కూడా మరల హీరోయిన్ ఫీచర్స్ లోకి వచ్చేసింది. ఈ లుక్స్ చూసిన తర్వాత అయిన ఎవరైనా దర్శకులు ఈ బ్యూటీకి హీరోయిన్ గా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.