పెళ్లి తరువాత కూడా అదే గ్లామర్ డోస్

Tue Jan 31 2023 13:00:01 GMT+0530 (India Standard Time)

Actress Pranita Subhash latest pic

భావ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ ప్రణీత శుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు కన్నడంలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించింది. అలాగే ఎన్టీఆర్ కి జోడీగా కూడా నటించింది. ఇక ఆమె చివరిగా తెలుగులో హలో గురు ప్రేమకోసమే సినిమాలో కనిపించింది. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఓ పాత్రలో కనిపించింది.కరోనా సమయంలో ప్రణీత చేసిన సోషల్ యాక్టివిటీస్ భాగా పాపులర్ అయ్యాయి. 2021లో ఆమె నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు సినిమాలలో సందడి చేసింది. హిందీలో రెండు సినిమాలలో ఆడిపాడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీకి కూతురు కూడా పుట్టింది. అయితే కూతురు పుట్టిన తర్వాత కూడా ఈ అమ్మడు గ్లామర్ లో ఎలాంటి మార్పులు రాలేదని చెప్పాలి. అంతే అందంతో మెరిసిపోతుంది.

అలాగే మంచి ఫిట్ నెస్ తో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది. ఇక పాప పుట్టిన కూడా ఈ అమ్మడు సినిమాలు మాత్రం ఆపలేదు. ప్రస్తుతం మలయాళంలో స్టార్ హీరో దిలీప్ 148వ సినిమాలో లీడ్ లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడుకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలు షేర్ చేయడంతో తనకి సంబందించిన ప్రతి మూవ్మెంట్ ని పంచుకుంటుంది. దీంతో ప్రణీతని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా ఈ అమ్మడు సన్ లైట్ వెలుగులో జీన్స్ ఫ్యాంట్ బ్లౌజ్ తో తీసుకున్న ఫోటోలో చాలా హాట్ గా కనిపిస్తుంది. ఈ లుక్ చూసిన తర్వాత ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇచ్చేలా ఉందనే మాట వినిపిస్తుంది

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.