నటి పూర్ణ పెళ్లి క్యాన్సిల్.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Wed Aug 10 2022 12:14:39 GMT+0530 (IST)

Actress Poorna's Wedding Is Cancelled

ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కేరళలో జన్మించినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించే పూర్ణ..  రవిబాబు దర్శకత్వంలో వచ్చిన `అవును` `అవును 2` చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ఈ సినిమా తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ అవేమి ఆమెకు సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. కెరీర్ పూర్తిగా డౌన్ అవుతున్న తరుణంలో పాపులర్ టీవీ షో `ఢీ`కి జడ్జ్ గా వచ్చి.. మళ్లీ అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది.

ఈ షో ద్వారా సంపాదించుకున్న క్రేజ్ తో పూర్ణ మళ్లీ సినిమా అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వెబ్ సిరీస్ లతో  పాటు స్టార్ హీరోల సినిమాల్లో సహాక పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతోంది. ఇకపోతే ఈ అమ్మడు ఇటీవలె తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసి సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే.

బడా వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పూర్ణ ఏడడుగులు నడవబోతోంది. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు గతంలో నెట్టింట తెగ హల్ చల్ చేశాయి. ఇక త్వరలోనే పూర్ణ నుండి మ్యారేజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పూర్ణ పెళ్లి క్యాన్సిల్ అయిందని షానిద్ అసిఫ్ అలీతో ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందనే వార్తలు ఊపందుకున్నాయి.

దీనిపై అధికారిక సమాచారం లేకున్నా.. సోషల్ మీడియాలో పూర్ణ పెళ్లిపైనే జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్ణ ఆలస్యం చేయకుండా తన పెళ్లి విషయంలో వస్తోన్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ అమ్మడు తనకు కాబోయే భర్త షానిద్ అసిఫ్ అలీను గట్టిగా హత్తుకుని ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కు `ఎప్పటికీ నా వాడివే` అని క్యాప్షన్ ఇచ్చి లవ్ సింబల్స్ ను కూడా జతచేసింది.

ఇక ఈ ఒక్క పోస్ట్ తో పూర్ణ పెళ్లిపై వస్తోన్న వార్తలు కేవలం పుకార్లే అని స్పష్టంగా తేలిపోయింది. దీంతో పూర్ణ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా పూర్ణ మనువాడబోయే వ్యక్తి వివరాలను పరిశీలిస్తే.. షానిద్ అసిఫ్ అలీ కేరళ రాష్ట్రానికి చెందిన వారట. ఆయన యూఏఈ బేస్డ్ వ్యాపారవేత్త. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సీఈఓ ఫౌండర్ గా షానిద్ వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.