కన్నీళ్లు పెట్టుకున్న మృణాల్ ఠాకూర్

Tue Mar 21 2023 22:02:17 GMT+0530 (India Standard Time)

Actress Mrunal Thakur breaks down in tears

సీతారామం సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు హిందీలో సీరియల్స్ లో సైడ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ జెర్సీ రీమేక్ తో హీరోయిన్ గా మారింది. అయితే ఊహించని విధంగా తెలుగులో సీతారమం సినిమాలో ఛాన్స్ సొంతం చేసుకుంది. నూర్జహాన్ అలియాస్ సీత పాత్రలో క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి నటించింది.ఈ అమ్మడు తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక రిలీజ్ అయిన అన్ని భాషలలో సీతారామం మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో సైతం స్టార్ సెలబ్రిటీల నుంచి మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు లభించాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు నేచురల్ స్టార్ నానికి జోడీగా తెలుగులో మరో సినిమాకి ఈ అమ్మడు కమిట్ అయ్యింది.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఇక కింగ్ నాగార్జున ప్రసన్న కుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం మృణాల్ ఠాకూర్ ని సంప్రదిస్తున్నట్లు టాక్. అలాగే వెంకటేష్ కూడా శైంధవ్ సినిమా కోసం మృణాల్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు బయట అల్ట్రా మోడరన్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో నిత్యం ఇన్స్టాగ్రామ్ లో సందడి చేస్తుంది. ఈమె ఫోటోలకి ప్రత్యేకంగా లక్షల్లో ఫ్యాన్ ఉన్నారు. ఇదిలా ఉంటే సడెన్ గా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో కన్నీళ్లు పెట్టుకున్న ఒక ఇమేజ్ షేర్ చేసింది.

ఆ ఫోటో చూసిన తర్వాత మృణాల్ కి ఏదో జరిగింది అని అందరూ అనుకున్నారు. అయితే ఫోటోపై ఆమె రాసిన వ్యాఖ్యలు చాలా స్పూర్తినిచ్చే విధంగా ఉన్నాయి. నిన్న కష్టంగా అనిపించింది. అయితే ఈ రోజు నేను బలంగా తెలివిగా సంతోషంగా ఉన్నాను.ప్రతి ఒక్కరి కథలో వారికి కొన్ని పేజీలు ఉంటాయి. అయితే వాటినిబిగ్గరగా చదవరు. అయితే నేను మాత్రం చదువుతాను. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠాన్ని ఇంకెవరైనా నేర్చుకోవాలి అని. ఒక రోజు కచ్చితంగా మనకి వస్తుంది. అంత వరకు బలంగా ధైర్యంగా ఉండటానికి ఆ పాఠం ఉపయోగపడుతుంది అని రాసుకొచ్చింది. ఈ ఫోటో ఆమె రాసిన కొటేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.