పద్ధతిగా కనిపిస్తూనే రెచ్చగొడుతున్న క్యూట్ బ్యూటీ!

Wed Mar 22 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Actress Meenakshi Chaudhary latest pic

ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మీనాక్షి చౌదరి. ఈ అమ్మడు రెండో సినిమానే ఏకంగా మాస్ మహారాజ్ రవితేజతో ఖిలాడీ సినిమాలో నటించింది. ఈ సినిమాలో మంచి పాత్రనే దొరికిన మూవీ డిజాస్టర్ కావడంతో రెండో అవకాశం రావడానికి సమయం పయ్యింది. హిట్ 2లో అడవి శేష్ కి జోడీగా రెండో సినిమా ఛాన్స్ ని ఈ బ్యూటీ తెలుగులో సొంతం చేసుకుంది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ హీరోగా రామ్ తళ్ళూరి నిర్మాణంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో ఈమెని హీరోయిన్ గా ఖరారు చేశారు. తెలుగులో ఈ బ్యూటీకి ఇది నాలుగో సినిమా కావడం విశేషం. ఈ అమ్మడు మిస్ ఇండియా 2018 విన్నర్ గా అందాల పోటీలలో మెరిసింది. తరువాత మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలలో కూడా ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహించి ఫైనల్ రౌండ్స్ వరకు వెళ్ళింది. ఆ తరువాత మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ చాలా కమర్షియల్ యాడ్స్ కూడా చేసింది.

తరువాత  అవుట్ ఆఫ్ లవ్ అనే హిందీ వెబ్ సిరీస్ తో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఎంత అల్ట్రా మోడరన్ గా కనిపిస్తూ ఉంటుందో అంతే స్థాయిలో ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో కూడా అచ్చమైన ఇండియన్ గర్ల్ గా కనిపిస్తుంది. మీనాక్షి చౌదరి తెలుగులో సక్సెస్ కి కూడా ఇదే కారణం అని చెప్పాలి.

ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలలో చాలా వరకు ట్రెడిషనల్ గర్ల్ తరహా పాత్రలనే చేసింది. ఇదిల ఉంటే ఈ అమ్మడు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో  ట్రెడిషనల్ చుడిదార్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఈ కాస్ట్యూమ్స్ లో ఎద అందాలు చూపిస్తూ టీజ్ చేస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ టీజ్ చేస్తూ ఉంటే కుర్రాళ్ళు తట్టుకోవడం కష్టమే అనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.