Begin typing your search above and press return to search.

అక్కాచెల్లెళ్లా? త‌ల్లీ కుతుళ్లా! షాక్ లో మీనా ఫ్యాన్స్!!

By:  Tupaki Desk   |   19 Sep 2021 6:30 AM GMT
అక్కాచెల్లెళ్లా? త‌ల్లీ కుతుళ్లా! షాక్ లో మీనా ఫ్యాన్స్!!
X
వెట‌ర‌న్ న‌టి మీనా పెళ్లి చేసుకున్నా సినిమా కెరీర్ ని మాత్రం ఏద‌శ‌లోనే ఆప‌లేదు. ఏదో భాష‌లో సినిమా చేస్తూనే ఆమె బిజీగా ఉన్నారు. ఒక‌ప్పుడు ద‌క్షిణాదిన అగ్ర తారగా వెలిగిన మీనా ఇప్పుడు ఆనాటి హీరోల‌కు ప‌ర్ పెక్ట్ మ్యాచ్ గా న‌టిస్తున్నారు. `దృశ్యం` సినిమాలో వెంక‌టేష్ భార్య పాత్ర‌లో న‌టించి మ‌రోసారి నాటి రోజుల్ని గుర్తుచేసారు. ప్ర‌స్తుతం `దృశ్యం-2`లోనూ వెంక‌టేష్ కి జోడీగా న‌టిస్తున్నారు. నిజానికి ఈ సినిమా మీనా టాలీవుడ్ కెరీర్ కి ఎంతో ప్ల‌స్ అనే చెప్పాలి. ఒక‌ప్పుడు చిరంజీవి..బాల‌కృష్ణ‌. .మోహ‌న్ బాబు..నాగార్జున స‌ర‌స‌న ఎన్నో సినిమాల్లో న‌టించారు. మ‌ళ్లీ ఇప్పుడు ఆ హీరోల‌కు స్క్రిప్ట్ ని బ‌ట్టి మీనా ఒక‌ ఆప్ష‌న్ గా క‌నిపిస్తున్నారు.

పైగా `దృశ్యం` గుర్తింపు వెట‌న‌ర్ న‌టికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మారింద‌న్న‌ది వాస్త‌వం. వ‌య‌సు రీత్యా మీనా 45 దాటినా ఆమెలో అందం.. ఛ‌రిష్మా ఇసుమెత్తు కూడా క‌రిగిపోలేదు. తాజాగా కుమార్తె నైనికా తో క‌లిసి ఫోటో షూట్ లో పాల్గొన్నారు ఈ సీనియ‌ర్ న‌టి. ఇందులో మీనా- నైనికా లు త‌ల్లీ కూతుళ్లులా కాకుండాగా అక్కా చెల్లెళ్లులాగా క‌నిపిస్తున్నారు. వంగ పువ్వు రంగు చీర‌లో మీనా..అదే క‌ల‌ర్ గౌనులో నైనికా త‌ళుక్కున మెరిసారు. నైనికా బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌ల్లికూతుళ్లిద్ద‌రూ ఇలా అందంగా తాయ‌రై ఫోటో షూట్లో పాల్గొన్నారు. నైనికా మీనా ఒక్క‌గానొక్క కుమార్తె. మీనా గారాల ప‌ట్టి. కుమార్తెను ఎప్పుడు ఎంతో అందంగా ముస్తాబు చేసి అభిమానుల‌కు చూపిస్తుంటారు. ఇక నైనికా చైల్డ్ ఆర్టిస్ట్ గా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `తేరి` సినిమాలో నైనికా విజ‌య్ కుమార్తె పాత్రలో న‌టించింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో నైనికాకి మంచి పేరొచ్చింది. మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా కోలీవుడ్ లో తొలుత‌ ప‌రిచ‌య‌మమ్యారు. ఆ త‌ర్వాత తెలుగు..హిందీ భాష‌ల్లోన ప‌లు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించారు. అటుపై హీరోయిన్ గా ప్ర‌మోట్ అయ్యారు. సౌత్ లో అన్ని భాష‌ల్లనూ మీనా హీరోయిన్ గా న‌టించారు. ఇప్పుడు వ‌య‌సుకు తగ్గ పాత్ర‌ల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు కుమార్తె నైనికాని కూడా అదే పంథాలో తీసుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం నైనికా స్కూలింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. బాల‌న‌టిగా పెరిగిన క్రేజుతో నైనిక కూడా టీనేజీలో క‌థానాయిక‌గా వెలుగులు విర‌జిమ్మ‌డం ఖాయంగానే అభిమానులు భావిస్తున్నారు.