Begin typing your search above and press return to search.

ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న కృతి కర్బందా

By:  Tupaki Desk   |   24 March 2023 8:00 AM GMT
ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న కృతి కర్బందా
X
టాలీవుడ్ లో ఒంగోలు గిత్తా, మిస్టర్ నూకయ్య సినిమాలలో హీరోయిన్ గా నటించిన అందాల భామ కృతి కర్బందా. ఈ అమ్మడు బోణీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. పవన్ కళ్యాణ్ కి జోడీగా తీన్ మార్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మాత్రం కొంత వరకు పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత టాలీవుడ్ లో కెరియర్ ఆశించిన స్థాయిలో ముందుకి సాగలేదు.

దీంతో బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ అక్కగా కూడా నటించింది. ఇక తెలుగులో మూవీస్ రాకపోవడంతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కొంత వరకు మంచి చిత్రాలలో నటిస్తూ వస్తుంది. ఇప్పటికి హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తుంది. హిందీలోకి అడుగుపెట్టిన తర్వాత కృతి కర్బందా గ్లామర్ షో కూడా పెంచేసింది అని చెప్పాలి. రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని పెంచుకుంటుంది.

ఈ బ్యూటీకి ఇన్స్టాగ్రామ్ లో 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ లాంగ్ డ్రెస్ లో ఎద అందాలు చూపిస్తూ గ్లామర్ ఫోటోలని ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో కృతి అందం మరింత రెట్టింపు అయ్యిందనే మాట ఫ్యాన్స్ నుంచి పిస్తుంది. ఇక టెంప్టింగ్ ఫోజులతో ఈ అమ్మడు ఈ ఫోటోలతో రెచ్చగొడుతూ ఉండటం విశేషం.

ఈ ఫోటోలు పోస్ట్ చేసిన గంటలోనే ఏకంగా లక్ష మందికి పైగా వీక్షించడం విశేషం. ఇదిలా ఉంటే ఈ అమ్మడు చివరిగా 14 పెహరే అనే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తర్వాత కృతి కర్బందా అక్కడ యంగ్ యాక్టర్ తో లివింగ్ రిలేషన్ లో కూడా ఉంది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే టాక్ బి టౌన్ లో వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.