Begin typing your search above and press return to search.

కళ్ళు చెదిరేలా కృతి గ్లామర్ ట్రీట్.. అందుకేనా!

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:00 AM GMT
కళ్ళు చెదిరేలా కృతి గ్లామర్ ట్రీట్.. అందుకేనా!
X
టాలీవుడ్ బ్యూటీ కృతిశెట్టి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ... మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయ్యాయి.

నానితో కలసి శ్యాం సింగరాయ సినిమా లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నాగ చైతన్య తో కలిసి బంగార్రాజు సినిమా చేసింది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడింది. దీంతో ఆమెను అంతా అదృష్ట దేవతగా భావించారు. ఈ క్రమంలోని వరుసగా ఈ ముద్దు గుమ్మ ముగ్గురు యంగ్ హీరోల సినిమాల్లో నటించింది. అయితే ఎవరు ఊహించిన విధంగా మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. రామ్ తో వారియర్ సినిమా, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలు చేసి భారీ డిజాస్టర్ లను తన ఖాతాలో వేసుకుంది.

ఈ క్రమంలోని కృతి శెట్టి పేరు సోషల్ మీడియాలో డిజాస్టర్ గా మారింది. అంతేకాదు ఆమె కెరియర్ గ్రాఫ్ కూడా డౌన్ అయిపోయింది. కాగా ఈ క్రమంలోనే కృతిశెట్టి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు చెక్ పెడుతూ పరోక్షకంగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ తాను ఇండస్ట్రీలో ఎలాంటి రోల్స్ కైనా సిద్ధమే అంటూ హింట్ ఇచ్చింది. మెరిసే డ్రెస్ లో కృతి శెట్టి తలక్కున మెరిసింది.

ఒకవైపు ఎద అందాలతో రెచ్చగొడుతూనే.. మరోవైపు థైస్ అందాలతో కుర్రకారు గుండెల్లో మరింత మంట పుట్టిస్తుంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి ఇలా సిగ్నల్స్ ఇస్తుంది అంటూ జనాలు ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ భామ మరోసారి నాగచైతన్యతో జతకట్టనుంది. నాగచైతన్య కస్టడీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది . అంతేకాకుండా మరోసారి మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో జతకట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ హీరోలకు మరోసారి కలిసొస్తుందో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.