Begin typing your search above and press return to search.

బోల్డ్ పిక్ తో షాకిచ్చిన స్టార్ హీరో సోదరి..!

By:  Tupaki Desk   |   30 May 2023 5:46 PM GMT
బోల్డ్ పిక్ తో షాకిచ్చిన స్టార్ హీరో సోదరి..!
X
బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ అందరికీ పరిచయమే. ఆయన కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు, ఇతర భాషల్లోనూ నటించి ఆకట్టుకున్నారు. ప్రభాస్ సాహోలోనూ తండ్రి పాత్ర పోషించింది ఆయన. ఇక ఆయన కుమారు టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నాడు. అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది మాత్రం ఆయన ముద్దుల కూతురు గురించి.

జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్ ది హీరోయిన్లను తలదన్నే అందం. కానీ ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టలేదు. ఇతర వ్యాపార రంగంలో రాణిస్తోంది. కానీ తన అందంతో మాత్రం అందరనీ ఆకర్షించడంలో ఈ బ్యూటీ ఎప్పుడూ ముందుంటుంది. గతంలో బికినీ ఫోటోలు షేర్ చేసి అందరి చూపు తన వైపు తిప్పుకుంది.

ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేసి షాకిచ్చింది. తాజాగా ఓ బోల్డ్ ఫోటో షేర్ చేసింది. అందులో ఆమె ఇచ్చిన ఫోజు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. డీప్ నెక్ తో ఉన్న గౌను ధరించింది. తన ముందుర అందాలు ఈ ఫోటోలో స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక సమ్మర్ కదా, దానికి తోడు ఈ బ్యూటీ కూర్చోవడం కూడా మంచి ఎండలో కూర్చుంది. ఆ ఎండకు తన అందం కందిపోకుండా.. తలకు మాత్రం హ్యాట్ ధరించింది. మెడలో ఓ చిన్నలాకెట్ ధరించింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇక కృష్ణ ష్రాఫ్ ఫోటోకి నెటిజన్లు మాత్రమే కాదు, హీరోయిన్లు తారా సుతారియా లాంటివారు కూడా రిప్లై ఇస్తున్నారు. లవ్లీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సినీ రంగంలో లేకపోయినా ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె అందం కూడా అందుకు కారణం కావచ్చు.

ఇక ఆమె సోషల్ మీడియాలో తన ఫిట్నెస్ ఫోటోలు, తన సోదరుడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫిట్నెస్ విషయంలో ఆమె తన సోదరుడికి ఏ మాత్రం తీసిపోదని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు చూస్తే అర్థమౌతుంది.