రోడ్డుపైనే అందాల జాతర పెట్టిన మెగా బ్యూటీ

Fri Mar 17 2023 07:00:01 GMT+0530 (India Standard Time)

Actress Ketika Sharma latest pic

రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ కేతిక శర్మ ఆ తర్వాత వెంటనే లక్ష్య సినిమాలో నటించిన విషయం తెల్సిందే. మొదటి రెండు సినిమాల్లో నిరాశ పర్చినా కూడా అందాల విందు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉన్న కారణంగా మరో ఛాన్స్ అన్నట్లుగా మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఈ అమ్మడికి వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మొదటి నుంచి కూడా అందాల ఆరబోత చేస్తూ అవకాశాలు దక్కించుకుంటున్న కేతిక శర్మకు అదృష్టం కొద్ది మరో పెద్ద ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా ఫొటోలకు ఫోజ్ ఇచ్చింది. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ ఈ అమ్మడు చేస్తున్న అందాల ఆరబోత ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమా విషయమై అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ త్వరలోనే స్టార్ హీరో సినిమాలో నటించబోతుందనే ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే స్థాయి అందాల ఆరబోత చేస్తే ముందు ముందు స్టార్ హీరోలకు జోడీగా మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.