ఆఖరికి అక్కడా అందాల్ని ఆరబోస్తున్న మహానటి

Sun Jan 29 2023 16:00:01 GMT+0530 (India Standard Time)

Actress Keerthy Suresh recent advertisement

టాలీవుడ్లో చాలా హుందాగా కనిపించే హీరోయిన్లలో  కీర్తి సురేష్ ఒక్కరు.  నేను శైలజ మూవీతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని యూత్ కు దగ్గరైంది. ఆమె నటించిన చాలా సినిమాల్లో హోమ్లీగా కనిపించి.. ఫ్యామిలీ ఆడియెన్స్నూ కీర్తి సురేష్ ఆకట్టుకుంది. ఈ క్రమంలో వచ్చిన మహానటి మూవీతో ఆమె ఇండియా వైడ్ గా స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు  వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందాయి.  కానీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఇక మహానటి తర్వాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా.. అవి ఆమెకు కలిసిరాలేదు. దీంతో అందరు హీరోయిన్లలా కీర్తి  కూడా గ్లామర్ ను నమ్ముకుంది. వరుస ఫోటో షూట్లతో యూత్ లో హీట్ పెంచింది. అలా కుర్రాళ్లను కట్టిపడేసి మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక సర్కార్ వారి పాటకు ముందు వరకు కూడా పెద్దగా అందాల ఆరబోత చేయని కీర్తి.. ఈ మూవీలో భారీగా అందాల ఆరబోత చేసి అందర్నీ షాక్ కు గురి చేసింది.

అలా వెండితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ  ఫుల్లుగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫాలోయర్స్ ను రోజు రోజుకూ పెంచేస్తోంది. దీంతో ఆమెకు కమర్షియల్ యాడ్స్  ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇందులో కూడా ఈ ముద్దుగుమ్మ తన అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఫుల్ గ్లామర్ ఫిస్టును వడ్డిస్తోంది. ఇది చూసిన నైటీజన్స్ కీర్తి సురేష్ సూపర్ ఎంత అందంగా ఉందో మా మహానటి వెరీ క్యూట్ సో హాట్ మరీ ఇంతగా అందాల్ని ఆరబోస్తోందేంటి?  అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాని హీరోగా చేస్తున్న దసరా మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో గ్లామర్ పాత్ర కాకుండా డీగ్లామర్ రోల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్లు ఆకట్టుకుంటున్నాయి.ఇక చిరంజీవితో కలిసి భోళా శంకర్ మూవీలోనూ నటిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా నటిస్తోంది. ఈ సినిమాను మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమిళంలో రిలీజ్ అయిన వేదాలం సినిమాకు బోళాశంకర్ రీమేక్ అని తెలిసిందే. ఇక వీరికి కీర్తి కలిసి వస్తోందో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.