కత్రిన.. ది న్యూ బిజినెస్ ఉమెన్

Mon May 27 2019 15:51:18 GMT+0530 (IST)

Actress Katrina Kaif Turns Into Producer

ఆమె ఇంతకాలం అగ్ర కథానాయిక. కేవలం హీరోయిన్ మాత్రమే. ఇకపై ఫక్తు బిజినెస్ ఉమెన్ గా మారబోతోంది. నిరంతరం ఎంటర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ ని అనుసరిస్తూ.. కార్పొరెట్ వరల్డ్ లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ధనార్జనకు ఆస్కారం ఉన్న రకరకాల రంగాల్లో పెట్టుబడులు వెదజల్లేందుకు రెడీ అవుతోంది. అందుకు ఇంతకాలం కష్టపడి సంపాదించినదంతా బ్యాంక్ ఖాతాల నుంచి బయటకు తీస్తోందట. ఇంతకీ ఎవరావిడ? అంటే ది గ్రేట్ కత్రిన కైఫ్.కత్రిన తన కెరియర్ లో లైఫ్ లో కొత్త ఫేజ్ లో అడుగుపెట్టబోతోంది. తన ఆలోచనలు ఇటీవల పూర్తిగా మారాయి. అనుష్క శర్మ.. ప్రియాంక చోప్రాలా నిర్మాతగా రాణించేందుకు.. సన్నీలియోన్ లా కార్పొరెట్ వరల్డ్ లో రాణించేందుకు ప్రణాళికలు వేస్తోంది. తొలిగా సినీనిర్మాతగా రాణించేందుకు కత్రిన సీరియస్ ప్రయత్నాలు చేస్తోంది.  `హీ లవ్స్ మీ.. హీ లవ్స్ మీ నాట్` అనే ఫ్రెంచి మూవీ హక్కులను కత్రిన చేజిక్కించుకుంది ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాల్లో ఉన్నామని తెలిపింది. ఈ సినిమాలో ఎంతో ఎగ్జయిట్ చేసిన పాయింట్ ఉంది. నిర్మాతగా నా తొలి ప్రయత్నమిది. తెరపై పేరును వేసుకోబోతున్నాను. ఈ ఏడాదే  సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్తాం అని తెలిపింది.

ఇందుకు భిన్నంగా సినీరంగంతో సంబంధం లేకుండా.. తన పేరుతో సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ ని ప్రారంభించేందుకు కత్రిన రెడీ అవుతోంది.  బిజినెస్ కోసం ఇప్పటికే చకచకా పావులు కదుపుతోంది. ఫక్తు బిజినెస్ ఉమెన్ గా మారేందుకు మేధస్సుకు పదును పెడుతోందట. అయితే బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఇప్పటికే స్టార్ స్టక్ పేరుతో సౌందర్య ఉత్పత్తులు తయారీ కంపెనీ ని ప్రారంభించి ఆర్జిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే కత్రినకు కార్పొరెట్ ఉత్పత్తుల ప్రారంభోత్సవానికి రెడీ అవుతుండడం చర్చకు వచ్చింది. ఇందుకు సన్నీనే ప్రేరణనిచ్చిందా? అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే సోనమ్ - రియా కపూర్ ఇప్పటికే ఫ్యాషన్ అండ్ వరల్డ్ లో ఉన్నారు. వస్త్రశ్రేణిని అభివృద్ధి చేస్తున్నారు. ఆ తరహా ఆలోచనలు కత్రిన మైండ్ లో ఉన్నాయేమో చూడాల్సి ఉందింకా.