వారికి నా ఇంటికి వచ్చే అర్హత లేదు : కంగనా

Thu May 19 2022 08:00:01 GMT+0530 (IST)

Actress Kangana Ranaut

కంగనా రనౌత్ హీరోయిన్ గా రూపొందిన ధాకడ్ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. సాదారణంగానే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో బాలీవుడ్ స్టార్స్ పై విమర్శలు చేస్తూ ఉంటుంది. అలాంటి కంగనా రనౌత్ తాజాగా మీడియా ముందుకు వచ్చి పలు సందర్బాల్లో పలువురు స్టార్స్ పై విమర్శుల చేసింది. అక్షయ్ కుమార్ మరియు అమితాబచ్చన్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.అక్షయ్ కుమార్ ఇటీవల ఒక సందర్బంగా కలిసినప్పుడు తలైవి సినిమా బాగుందని అన్నాడు.. కాని కనీసం సినిమా ప్రమోషన్ కోసం చిన్న ట్వీట్ చేయడం లేదా.. బాహాటంగా అభినందించడం చేయలేదని కంగనా చెప్పుకొచ్చింది. అక్షయ్ కుమార్ మాత్రమే కాకుండా ఇతర బాలీవుడ్ స్టార్స్ ఎవరు కూడా తన సినిమాల గురించి ప్రమోట్ చేయరని.. ఒక వేళ ప్రమోట్ చేస్తే వారికంటే ఎక్కువ స్టార్ డమ్ వస్తుందని వారి భయం అంటూ కంగనా చెప్పుకొచ్చింది.

తాజాగా మరోసారి కంగనా రనౌత్ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో ఏ ఒక్క స్టార్ తో తనకు స్నేహ సంబంధం లేదు. ఏ ఒక్కరికి కూడా తన ఇంటికి వచ్చేంత సన్నిహిత్యం లేదు.. ఏ ఒక్కరు కూడా తన ఇంటికి వచ్చేంత అర్హులు కారు. వారితో నేను బయటే మాట్లాడేస్తూ ఉంటాను. బాలీవుడ్ కు చెందిన వారిని ఎవరిని కూడా నేను నా ఇంటికి ఆహ్వానించను అంది.

కంగనా పదే పదే బాలీవుడ్ స్టార్స్ పై విమర్శలు చేయడం పట్ల కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీ సినిమా ప్రమోషన్ కోసం పదే పదే బాలీవుడ్ స్టార్స్ ను చిన్నతనం చేసి మాట్లాడటం ఏమాత్రం సబబు కాదు అంటూ ఆగ్రహంతో సోషల్ మీడియాలో కంగనా రనౌత్ ను విమర్శిస్తున్నారు.

కంగనా రనౌత్ ఇతర హీరోయిన్స్ ను కూడా గతంలో విమర్శించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా స్టార్ కిడ్స్ ను తీవ్ర స్థాయిలో విమర్శించే కంగనా రనౌత్ ఇప్పటికి కూడా తన పద్దతిని కంటిన్యూ చేస్తోంది. తాను మాత్రమే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ను... తాను నటనలో గొప్ప అంటూ తనకు తాను కితాబిచ్చుకుంటూ కంగనా గొప్పలు చెప్పడం చాలా కామన్ విషయం అయ్యింది.