ఇలియానాకు అనారోగ్యం.. ఇదిగో ఇలా బెడ్ పై నుంచే!

Mon Jan 30 2023 21:14:55 GMT+0530 (India Standard Time)

Actress Ileana DCruz gets hospitalised shares health update

గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఇలియానా డి క్రజ్ ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలైంది. తాజాగా ఈ విషయాన్ని ఇన్ స్టాలో ఫోటో ఆధారాలు సహా బయటపెట్టింది. ఇల్లీ చేతి నరానికి సూది మందు ఎక్కుతున్న ఫోటోలు.. బెడ్ పై ఫ్లూయిడ్స్ తీసుకుంటున్న కొన్ని ఫోటోలు షేర్  చేయగానే .. అరే ఇలియానాకు ఏమైంది? అంటూ అభిమానులు కంగారు పడ్డారు.కొన్ని వరుస ఇన్ స్టా పోస్ట్ ల్లో ఇలియానా తన అనారోగ్యం గురించి ప్రస్థావిస్తూ కంగారు పడాల్సినదేమీ లేదని తెలిపింది.``రోజు రోజుకు ఆరోగ్యం మెరుగవుతోంది. ఎంతో కొంత తేడా ఉంది. కొందరు చక్కని వైద్యులు సహకారంతో కోలుకుంటున్నా. 3 బ్యాగుల ఐవీ ఫ్లూయిడ్స్ (ద్రవాలు)...ఎక్కించారు! అంటూ ఇలియానా తన స్టాటస్ గురించి వెల్లడించింది.

నా ఆరోగ్యం గురించి ఆరాలు తీస్తూ నాకు మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నాపై మీ శ్రద్ధ ప్రేమకు చాలా ధన్యవాదాలు. నేను నిజంగా మీ ప్రేమను అభినందిస్తున్నాను. ఇప్పుడు పూర్తిగా బాగున్నానని మీకు హామీ ఇస్తున్నాను`` అని అభిమానులను సముదాయించింది. సరైన సమయంలో మంచి వైద్యం పొందండి...! అని ఇలియానా తన అభిమానులకు సూచించింది.

అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో.. ఇలియానా తాను బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. తనకు 12 ఏళ్ల నుంచి ఈ సమస్య ఉందని ఇలియానా వెల్లడించింది. తన అనారోగ్యం విషయంలో ఎంతో స్పృహతో ఉంది. పరిస్థితులకు తగ్గట్టు చక్కని ప్రణాళిక ఆహార నియమాలు పాటిస్తూ అనారోగ్యం నుంచి తనను తాను కాపాడుకుంటోంది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే... ఇలియానా తదుపరి `తేరా క్యా హోగా లవ్లీ`లో కనిపిస్తుంది. ఇది ఇటీవల ఇఫీ ఉత్సవాల్లో ప్రదర్శితమైంది. ఈ చిత్రంతో మొదటిసారిగా రణదీప్ హుడా సరసన ఇలియానా స్క్రీన్ స్పేస్ ను షేర్ చేసుకోనుంది. అలాగే సీనియర్ నటి విద్యాబాలన్ - ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రంలోను ఇలియానా ఒక కీలక పాత్రను పోషిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.