నా పెళ్లి.. విడాకుల్లో నన్ను భాగస్వామ్యం చేయండి ప్లీజ్

Fri Jan 28 2022 18:00:01 GMT+0530 (IST)

Actress Himaja On Instagram

బుల్లి తెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ హిమజ. ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియా మరియు షోలతో సందడి చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు తన భర్తకు విడాకులు ఇచ్చింది. విడి పోయిన ఆమె ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.. తల్లితో కలిసి ఆమె సోలోగా జీవిస్తున్నారు. విడాకులకు కారణం ఇది అది అంటూ రకరకాలుగా గత కొన్ని రోజులుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేయడం మొదలు పెట్టాయి. దాంతో ఆమె అభిమానులు అవాక్కయ్యారు. నిజంగానే హిమజకు గతంలో పెళ్లి అయ్యిందా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఎట్టకేలకు ఆ వార్తలకు హిమజ తనదైన శైలిలో స్పందించింది.ఈమద్య కాలంలో యూట్యూబ్ లోనే పెళ్లిలు చేసి విడాకులు కూడా ఇచ్చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. నాకు పెళ్లి చేసినా విడాకులు ఇచ్చినా కూడా నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేయండి ప్లీజ్ అంటూ ఆమె ఒక వీడియోను షేర్ చేసింది. ఎవడో ఆ వార్తను పుట్టించాడు సరే ఆ వార్తను అందరు ఎలా సర్క్యూలేట్ చేస్తున్నారు అంటూ హిమజ ప్రశ్నించింది. మీడియా కు ఈ మద్య కాలంలో హద్దు పద్దు లేకుండా పోయింది అంటూ ఆమె అసహనం వ్యక్తం చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తమ ఇష్టానుసారంగా కథనాలు రాస్తూ అల్లేస్తున్నారు. చాలా మంది నాకు ఈ వీడియోల లింక్స్ మరియు కథనాల లింక్స్ ను షేర్ చేయడం జరిగింది. వాటన్నింటిని చూసి నేను అవాక్కయ్యాను.

మొదట ఇలాంటి వార్తల గురించి నేను స్పందించకూడదు అనుకున్నాను. కాని చాలా మంది నన్ను అసలు ఏం జరిగిందో చెప్పాలి అక్క అంటూ అడిగారు. అందుకే నా కుటుంబ సభ్యుల కోసం మరియు అభిమానుల కోసం ఈ క్లారిటీ ఇచ్చేందుకు వచ్చాను. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పెళ్లి గురించి విడాకుల గురించి వార్తలు రాయవద్దని హెచ్చరించింది. నాలుగు ఏళ్ల వరకు పెళ్లి విషయమై నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను. ఒక పెద్ద గుడిలో అద్బుతమైన అలంకరణ మద్య భారీగా పెళ్లి చేసుకుంటాను అంటూ హిమజ చెప్పుకొచ్చింది. ఈ లోపు ఎలాంటి పుకార్లు రాయవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. మొత్తానికి సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన వీడియో ఆమె విడాకుల వార్తకు చెక్ పెట్టినట్లయ్యింది.