యూట్యూబ్ ఛానెల్స్ పై నటి ఫిర్యాదు!

Tue Mar 21 2023 20:40:17 GMT+0530 (India Standard Time)

Actress Hema complaint on youtube channels

సోషల్ మీడియా సహా యూట్యూబ్ వంటి ఛానెల్స్ అందుబాటులోకి వచ్చాక తప్పుడు ప్రచారాలు ఏ రేంజ్లో జరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యూ ట్యూబ్ ఛానెల్స్ సెలబ్రిటీల్ని టార్గెట్ చేసిన వైనంపై ఇప్పటికే  పలువురు సెలబ్రిటీలు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఆ మధ్య  సమంత ఓ ఛానెల్ పై ఇలాగే పరువు నాష్టం దావ కేసు కూడా వేసింది. చివరికి రాజీ కుదరడంతో ఆ వివాదం అక్కడితో సద్దు మణిగింది.తాజాగా నటి హేమ  సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. మూడేళ్ల క్రితం వివాహ వార్షికోత్సవంలో తన భర్తతో ఉన్న ఫోటోలు..వీడియోని ఇప్పుడు పోస్ట చేసి ఫేక్ థంబనైల్స్ పెట్టి అసత్యం ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెలబ్రిటీల్నీ టార్గెట్ చేసి అసత్య ప్రచారం చేస్తోన్న యూ ట్యూబ్ ఛానెల్స్..వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఉంది. ఇక బ్రతికున్న వార్ని కూడా కొన్ని వెబ్ సైట్స్ చనిపోయినట్లుగా  తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని- అలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకుని వాటిని మూయించే దిశగా చర్యలు తీసుకోవాలని హేమ కోరారు.

ఇటీవలే సీనియర్ నటుడు  కొట శ్రీనివాసరావు ఉదంతాన్ని గుర్తు చేసారు. ఆయన  ఆరోగ్యం ఉన్నా చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేసారని ..చివరికి తాను బ్రతికే ఉన్నాను అన్న సంగతి ఓ వీడియో చేసి చెప్పుకునే దుస్తితికి కొన్ని ఛానెల్స్  తీసుకొచ్చాయని  మండిపడ్డారు.  ఈ విషయంలో రాజీ పడేది లేదని ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని.. కోర్టులో కేసు ఫైల్ అయి విచారణ సాగే వరకూ  పోరాటం చేస్తానని హేమ  అన్నారు.

మొత్తానికి మరోసారి తప్పుడ కథనాలపై సెలబ్రిటీలు నడుం  బిగించినట్లు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో కొన్ని యూ ఛానెల్స్ ఇష్టాను సారం తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా మనోభావాలు దెబ్బతినేలా టైటిల్స్ పెడుతూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని ఎవరూ పట్టించుకుంటారు? అన్న  ధీమా సదరు యాజమాన్యాల్లో కనిపిస్తుంది. గతంలో సైబర్ క్రైమ్ ఎంట్రీతో చాలా యూ ట్యూబ్ ఛానెల్స్ ని మూయించారు. కొంత మంది సెలబ్రిటీలు పరువు నష్టం దావా కేసులు వేడయంతో అవి ఇంకా కోర్టు ఫరిదిలోనూ ఉన్నాయి.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.