ఫొటో టాక్: నిన్ను ఇలా ఊహించలేదు ఈషా..

Wed Mar 29 2023 09:26:13 GMT+0530 (India Standard Time)

Actress Eesha Rebba latest pic

టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి ఈషా రెబ్బా. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. చేసేది చిన్న సినిమాలు అయినా కూడా గట్టిగా మాత్రం ఆమె తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉంది.కమర్షియల్ సినిమాలలో స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు రాకపోయినా కూడా గ్లామర్ బ్యూటీగా టాలీవుడ్ లో ఈషా రెబ్బా కొనసాగుతోంది. ఇక తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ లేకపోవడంతో తమిళ్ మలయాళీ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ సినిమాలు చేస్తూ వస్తుంది.

ప్రస్తుతం ఆమె చేతిలో ఈ ఏకంగా మూడు సినిమాల వరకు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మరోవైపు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో కూడా ఎంట్రీ ఇచ్చి త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు చేరుకోలేదు. అయితే మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేయడానికి ఈషా రెబ్బా ఆసక్తి చూపిస్తుంది.  ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కాస్త స్పీడ్ పెంచిందని చెప్పాలి.

గ్లామర్ షో వైపు అడుగులు వేస్తూ మెల్లగా తనను తాను షోకేస్ చేసుకుంటుంది. అందాల ప్రదర్శనలో కూడా ఇతర గ్లామర్ హీరోయిన్స్ తో పోటీ పడుతుంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక ఫ్యాషన్ వీకెండ్ లో ఈమె అదిరిపోయి కాస్ట్యూమ్స్ తో రాంప్ వాక్ చేసింది. వైట్ కలర్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో నడుము చూపిస్తూ మాయ చేసింది. మరోవైపు ఎద అందాలను బిగుతుగా పైకి చూపిస్తూ తాపం పెంచేసింది.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తే కచ్చితంగా రానున్న రోజుల్లో డిజిటల్ ఒటీటీలో మంచి అవకాశాలు తెచ్చుకొని సెటిల్ కావడం ఖాయం అనే మాట వినిపిస్తుంది. మరింతగా గ్రామర్ డోస్ పెంచితే ఈషా రెబ్బాకి అవకాశాలు పెరగడం గ్యారెంటీ అని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తూ ఉన్న మాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.