మోహిని కామినిలా మత్తెక్కిస్తున్న యవ్వనశిరి

Sun Feb 05 2023 19:00:01 GMT+0530 (India Standard Time)

Actress Divyansha Kaushik latest pic

నాగచైతన్య సరసన మజిలీ చిత్రంలో ఒక కథానాయికగా నటించింది దివ్యాంశ కౌశిక్. ఆరంభమే యువతరం మనసులు దోచింది. చైతో నిండా ప్రేమలో మునిగి గుట్టుగా రూమ్ కి వచ్చే అమ్మాయిగా టీనేజీ యూత్ గుండెల్లో గిలిగింతలు పెట్టింది. రవితేజ సరసన `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రంలోను ఘాటైన లిప్ లాక్ తో గుబులు రేపింది. ప్రస్తుతం పలు తెలుగు-తమిళ చిత్రాలకు సంతకాలు చేసింది.



సందీప్ కిషన్- విజయ్ సేతుపతి లాంటి తారాగణంతో తెరకెక్కిన `మైఖేల్`లో దివ్యాంశ కథానాయిక. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. కథనంలో బిగి లేకపోవడంతో ఈ సినిమాపై క్రిటిక్స్ పెదవి విరిచేసారు. అయినా క్రైమ్ కథాంశం కావడం పోటీబరిలో భారీ చిత్రాలేవీ లేకపోవడంతో మైఖేల్ ఫర్వాలేదనిపించే ఓపెనింగులు సాధించిందని చిత్రబృందం చెబుతోంది. ఇక ఈ చిత్రంలో దివ్యాంశ గ్లామరస్ గా కనిపించిందని టాక్.

తాజాగా ప్రమోషన్ కార్యక్రమంలో దివ్యాంశ కౌశిక్ రెడ్ హాట్ లెహంగాలో మత్తెక్కించే లుక్ తో కనిపించింది. దివ్యాంశ దివ్యమైన సౌందర్యానికి వేదిక వద్ద ఫోటోగ్రాఫర్లు పడిగాపులు పడి మరీ ఫోటోషూట్లు చేశారంటే అర్థం చేసుకోవాలి. మోహిని కామినిలా మత్తెక్కిస్తున్న యవ్వనశిరిని తలపించింది దివ్యాంశ. మజిలీ సినిమా టైమ్ కి కొంత లేత యవ్వనంతో కవ్వించిన ఈ బ్యూటీ ఇప్పుడు పరిణతి చెందిన అందాలతో నవపారిజాతాన్ని తలపిస్తోందని కితాబిచ్చేస్తున్నారు దగ్గరగా చూసినవారంతా. దివ్యాంశకు టాలీవుడ్ లో ఇంకా మంచి భవిష్యత్ ఉందని జోశ్యం చెబుతున్నారు.

ఈ బ్యూటీ తదుపరి సుధీర్ వర్మ తెరకెక్కించనున్న చిత్రంలోను  కథానాయికగా నటించనుందని కథనాలొచ్చాయి. హిందీలోను ది వైఫ్ (2021) అనే చిత్రంలో దివ్యాంశ నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో `ఐ లవ్ నాగచైతన్య`... అతడు చాలా అందగాడు! మాంచి క్రష్ ఉంది!! అంటూ మనసులో ఉన్న మాటను చెప్పేసిన దివ్యాంశ తదుపరి చైతన్యతో సినిమాకి కమిటయ్యే ఆలోచనలో ఉందని కూడా టాక్ వినిపించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.