బాలీవుడ్ డెబ్యూ పై ఇంత దారుణంగానా అమ్మడు!

Wed Jun 29 2022 09:02:22 GMT+0530 (IST)

Actress Debut Film In Bollywood

వస్తూనే కోలీవుడ్ లో అడుగు పెట్టింది ఆ భామ. తొలి ప్రయత్నం అక్కడ తేడా కొట్టింది. అటుపై రెండేళ్ల గ్యాప్ అనంతరం టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక్కడా ఆశించిన ఫలితం దక్కలేదు. అలా ఆరంభమే రెండు పరిశ్రమల్లో  చేదు అనుభవం. దీంతో సొంత భాషలో బిగ్ స్టార్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఇది నిజంగా సర్ ప్రైజింగ్ ఆఫర్.ఏ హీరోయిన్ కి రాని అరుదైన ఛాన్స్ అది. ఎంతో మంది హీరోయిన్లు ఆ హీరోతో రొమాన్స్ చేయాలని కలలు కంటారు. కలల రాకుమారుడు. అలాంటి ఛాన్స్ తొలి సినిమాతోనే దక్కించుకుంది. గతాన్ని గానీ..అనుభవాన్ని గానీ ఏమాత్రం బేరీజు వేయకుండా ఆ సినిమాకి ఎంపిక చేసారు. భారీ కాన్సాస్ పై ఆ చిత్రం  తెరకెక్కింది. అదే రేంజ్లో సినిమా విడుదలైంది.

కానీ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. కానీ సినిమాలో హీరోతో రొమాన్స్ అద్భుతంగా పండించింది. నటిగా మంచి పేరు సంపాదించింది.  ఆక్రేజ్ తోనే అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి. పరిశ్రమలో నిలదొక్కుకోగల్గింది. అటుపై బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు ఖాతాలో వేసుకుంది. ఆ ట్రాక్ చూసి పాన్ ఇండియా హీరోయిన్ గాను  ప్రమోట్ అయింది.

అటుపై తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది. పారితోషికం  భారీగా పెంచింది. ఇటీవలే ఆ హీరోయిన్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయి ఊహించని దెబ్బకొట్టాయి. మూడు పరాజయాలే మూటగట్టాయి. మరి ఈ ప్రెస్టేషన్ లో నోరు జారిందా? ఇంకేదైనా కారణం ఉందా? అన్నది తెలియదు. బాలీవుడ్ లో ఆ డెబ్యూ మూవీని ఓ చెత్త సినిమా గా అభివర్ణించింది.

తన కెరీర్ మొత్తానికి ఎప్పటికీ మర్చిపోలేని పీడ కలా లాంటి సినిమా అని తెగ  తిట్టేస్తోంది.  ఆసినిమా చేయకుండా ఉంటే బాగుండని పశ్చాత్తాప పడుతుంది. ఆ సినిమా కారణంగా అవకాశాలు రాకుండా పోయాయని తెగ కుమిలిపోతుంది. ఆ ప్లాప్ కారణంగా ఆరంభంలోనే ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిందని వాపోతుంది.

ఎవరికైనా జయాపజయాలు సహజం. వాటిని బ్యాలెన్స్ చేయడమే కీలకం. ఆ విషయంలో సదరు హీరోయిన్ సహనం కోల్పోయినట్లు కనిపిస్తుంది. కానీ  ఇక్కడ అమ్మడి వైఖరి మాత్రం స్పస్టంగా తేటతెల్లమవుతోంది. ఏరు దాటిన తర్వాత తెప్ప వదిలేసే రకమని విమర్శకి  తావిచ్చింది. నిజానికి బాలీవుడ్ లో అంత పెద్ద సినిమా చేయడం వల్ల వెంటనే  టాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. ఆ సంగతి ఇప్పుడు  మర్చిపోయింది పాపం. అంతేగా!  అవకాశం లేని వారికి తెలుస్తుంది ఆ ఛాన్స్ విలువ. ప్రస్తుతం అదే హీరోయిన్ హిందీలో ఓ రెండు సినిమాలు చేస్తోందండోయ్.