Begin typing your search above and press return to search.

నియోజ‌క‌వ‌ర్గాన్ని కిర్రెక్కించ‌డానికి దించారు

By:  Tupaki Desk   |   3 July 2022 6:32 AM GMT
నియోజ‌క‌వ‌ర్గాన్ని కిర్రెక్కించ‌డానికి దించారు
X
నియోజ‌క‌వ‌ర్గాన్ని గ‌గ్గోలు పెట్టించ‌డానికి మాస్ యూత్ కి కిర్రెక్కించడానికి అదిరిపోయే ఐట‌మ్ గాళ్ ని బరిలోకి దించారు. ఇంత‌కీ ఎవ‌రీ ఐట‌మ్ బ్యూటీ అంటే.. ఎవ‌రో చెప్పాల్సిన ప‌ని లేదు. త‌మిళ తెలుగు ప‌రిశ్ర‌మ‌ల్లో రాణించిన‌ తెలుగ‌మ్మాయ్ అంజ‌లిని బ‌రిలో దించింది నియోజ‌ర్వ‌ర్గం టీమ్. ఇరు భాష‌ల ఆడియెన్ ని గ‌గ్గోలు పెట్టించ‌డ‌మే ధ్యేయంగా ఈ ప్ర‌య‌త్న‌మా? అన్న‌ది చిత్ర‌బృందం చెప్పాల్సి ఉంది.

తాజాగా అంజ‌లి క‌టౌట్ తో పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` టీమ్. స్పెష‌ల్ నంబ‌ర్ లో న‌ర్తించ‌డం అంజ‌లికి ఇదే మొద‌టి సారి కాదు. ఇంత‌కుముందు మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీనంబ‌ర్ 150లో ఐట‌మ్ నంబ‌ర్ ఆఫ‌ర్ మిస్స‌యిన‌ ఈ బ్యూటీ ఆ త‌ర్వాత బ‌న్ని స‌రైనోడులోనూ ఐట‌మ్ నంబ‌ర్ లో మెరిసింది. అటు సింగం సినిమాలోనూ అంజ‌లి ఐటమ్ నంబ‌ర్ మెరుపులు తెలిసిందే. ఇప్పుడు మ‌ళ్లీ ఇలా ఐట‌మ్ నంబ‌ర్ తో నితిన్ అభిమానుల‌ను అల‌రించేందుకు వ‌స్తోంది.

ఐట‌మ్ నంబ‌ర్ లో రెడ్ హాట్ లుక్ తో అంజ‌లి ట్రీటివ్వ‌నుంది. ఈ సాంగ్ లో ధూమపానం చేస్తూ కనిపిస్తుంది. తెలుగమ్మాయ్ కిల్లర్ స్మైల్ ఈ పాట ఆద్యంతం స్పెష‌ల్ ట్రీట్ గా ఉంటుంది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిత్రీకరించిన పాటలో అంజలి గ్లామర్ విందు చేస్తుంది. టీమ్ రెగ్యులర్ గా ప్రమోష‌న్స్ కి సిద్ధ‌మైంది. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి- నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని రాజకీయ అంశాలతో పక్కా మాస్ .. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణ ప్రమాణాలు అత్యున్నత సాంకేతిక అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.

ప్రసాద్ మూరెళ్ల కెమెరా వ‌ర్క్ అందించ‌గా.. మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌. ముగ్గురు మాస్టర్స్ వెంకట్, రవివర్మ మరియు అనల్ అరసు సినిమా యాక్షన్ పార్ట్ కు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా కొరియోగ్రఫీ చేసారు. మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ చిత్రానికి స్వాతంత్య్ర‌ దినోత్సవం సెల‌వు (సోమవారం) క‌లిసి రానుంది. యూరప్ దేశాల్లోని ఇటలీ- ఆస్ట్రియాలోని కొన్ని సుందరమైన లొకేషన్లలో ఈ సినిమా పాటలను చిత్రీక‌రించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ అందించారు. ఎం.ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి- నికితారెడ్డి నిర్మిస్తున్నారు.

అంజ‌లి ఇంత‌కుముందు వ‌కీల్ సాబ్ లో న‌టించింది. త‌దుప‌రి శంక‌ర్- రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ పాన్ ఇండియా చిత్రం ఆర్‌.సి 15లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే భైరాగి అనే చిత్రంలోనూ క‌థానాయికగా న‌టిస్తూ బిజీగా ఉంది.