హాటు సినిమాలు చూడడమే కాదు.. కామన్ కదా అంటోంది!

Tue Jun 18 2019 14:11:14 GMT+0530 (IST)

హిపోక్రసీ ఎక్కువగా ఉండే సోసైటీలలో ఇండియా ఒకటి. లోపల అనుకునేది ఒకటి.. నోటితో చెప్పేది మరొకటి.. చేసిది ఇంకొకటి. మెజారిటీ జనాలు ఇలానే ఉన్నారు కాబట్టి అందరికీ ఇది అలవాటైపోయింది.  ఇక సెక్స్ విషయంలో.. పోర్న్ విషయంలో మన జనాల హిపోక్రసీ పీక్స్ లో ఉంటుంది.  అబ్బే.. మేం పోర్న్ చూడమని అంటారు.  కానీ ఇండియాలో మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీగా గూగుల్ సన్నీ లియోన్ పేరును ప్రకటిస్తుంది. ప్రతిఏడాది ప్రకటిస్తూ..నే ఉంటుంది.  అలా ఎందుకో మరి!  సాధారణ జనాల సంగతి పక్కన పెడితే సెలబ్రిటీలు ఈ టాపిక్ మాట్లాడరు. కొందరు సెలబ్రిటీలు మాత్రం పోర్న్ చూసే విషయాన్ని ఓపెన్ గా ఊపుకుంటారు. వర్మ అయితే పోర్న్ లేకుండా తనకు ముద్ద దిగదు అని ఓపెన్ గా చెప్పేస్తాడు. తాజాగా మరో సెలబ్రిటీ రెజినా ఆ లిస్టులో చేరింది.  ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో రెజినాను స్కూల్ లో చదివే సమయంలో అడల్ట్ ఫిలిమ్స్ చూశారా.. అని అడిగితే 'అవును' అని సమాధానం చెప్పి షాక్ ఇచ్చింది. అంతే కాదు "ఇప్పుడు చాలామందికి కామన్ అయింది కదా" అంటూ ఒక పంచ్ డైలాగ్ వేసింది. నిజమే చూడడం కామన్ అయింది.. కానీ చూసినట్టు ధైర్యంగా ఒప్పుకోవడం మాత్రం కామన్ కాలేదు!

సినిమాల విషయానికి వస్తే రెజినా రీసెంట్ గా విడుదలైన '7' లో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ 'ఎవరు' లో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా తమిళంలో మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.