Begin typing your search above and press return to search.

'సూపర్ స్టార్ తలైవాకి కరోనా పాజిటివ్..టెన్షన్ లో ఫ్యాన్స్!

By:  Tupaki Desk   |   5 Jun 2020 12:10 PM GMT
సూపర్ స్టార్ తలైవాకి కరోనా పాజిటివ్..టెన్షన్ లో ఫ్యాన్స్!
X
సినీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి కరోనా పాజిటివ్.. నిజమేనా.. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది.. సూపర్ స్టార్ల పరిస్థితి అలా ఉంటే మరి సామాన్య జనాల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం జనాల మెదళ్లలో మెదులుతున్న ప్రశ్నలివి. రజినీకాంత్ కి కరోనా పాజిటివ్ అనే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ తో ఒక యాక్టర్ ట్రోల్స్ బారిన పడుతున్నాడు. ఇటీవలే బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ సోషల్ మీడియాలో సూపర్ స్టార్ కి కరోనా పాజిటివ్ అనే పోస్ట్ పెట్టడం వివాదాస్పదంగా మారింది. అయితే ఆ పోస్ట్ చూసిన అభిమానులు.. తమ ఫేవరెట్ హీరో కరోనా బారిన పడ్డాడని ఉలిక్కిపడి.. టెన్షన్ కి గురయ్యారు. ఆ తర్వాత ఆ వార్త నిజం కాదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు సూపర్ స్టార్ అభిమానులు. అలాంటి పోస్ట్ క్రియేట్ పెట్టిన నటుడు రోహిత్ రాయ్ పై ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో విరుచుకు పడుతున్నారు. ఫ్యాన్స్ దెబ్బకి ఆ యాక్టర్ కారణం చెప్పాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ..

'కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కి కరోనా ప‌రీక్ష‌లు చేయగా పాజిటివ్ వ‌చ్చిందని.. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉన్నట్లు పోస్ట్ చేసాడు. పోస్ట్ కింద క్యాప్షన్ గా.. రోజులోఎక్కువసార్లు చేతులు కడుక్కోవడం.. శానిటైజర్స్ ఉపయోగించడం.. పారిశుధ్య చర్యలు తీసుకోవడం లాంటివి చేస్తేనే కరోనాని అరికట్టగలం' అని తెలిపాడు. అయితే ఎంత గొప్ప మనిషి అయినా కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా బారిన పడక తప్పదు అన్నట్లుగా పోస్ట్ పెట్టాడు రోహిత్ రాయ్. అసలు విషయం ఏంటంటే.. ఎవరి పేరైనా వాడుకో కానీ మా హీరో రజినీకాంత్ పేరు ఎందుకు వాడవు.. అంటూ ఫ్యాన్స్ రోహిత్ రాయ్‌ని ట్రోల్ చేస్తూ హెచ్చరిస్తున్నారు. ఇంకోసారి ఇలా చేయకు.. దేనికైనా హద్దు ఉంటుంది అంటూ విరుచుకు పడ్డారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ.. రోహిత్ లేని కష్టాలు కొనితెచ్చుకున్నాడని నెటిజన్లు అంటున్నారు.