తొమ్మిదేళ్ల తరువాత రామారావుతో డ్యూటీ ఎక్కాడు!

Wed Jul 06 2022 17:22:05 GMT+0530 (IST)

Actor Venu After nine years Rama Rao On Duty

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీ ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్.ఎల్ వీ సినిమాస్ ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. 'జైభీమ్' ఫేమ్ రజీషా విజయన్ 'మజిలీ' షేమ్ దివ్యాన్షకౌశిక్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో రవితేజ రెవెన్యూ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఆయన పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మరింత పవర్ ఫుల్ గా సాగుతుందని రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ క్లారిటీ ఇచ్చేసింది.

దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా వుంటే పలు దఫాలుగా రిలీజ్ వాయిదా పడుతున్న ఈ మూవీ ఎట్టకేలకు జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది.

ఈ నేపథ్యంలో టీజర్ తో పాటు మేకర్స్ మూడు లిరికల్ వీడియోలని విడుదల చేశారు. అన్వేషీ జైన్ రవితేజ పై చిత్రీకరించిన 'నా పేరు సీసా' స్పెషల్ సాంగ్ రీసెంట్ గా విడుదలై నెట్టింట సందడి చేస్తోంది. ఇదిలా వుంటే దాదాపు 9 ఏళ్ల విరామం తరువాత ఈ మూవీతో హీరో వేణు రీఎంట్రీ ఇస్తున్నారు. ఆమనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. అ చిత్రంలో వేణు సీఐ గా జమ్ము మురళి పాత్రలో నటిస్తున్నారు.

మీసం మెలితిప్పి పోలీస్ డ్రెస్ లో కనిపిస్తున్న వేణు లుక్ ఆకట్టుకుంటోంది. 2013లో వచ్చిన 'రామాచారి' మూవీ తరువాత వేణు సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. సినిమాల గురించి అడిగితే చేయనని చెబుతూ వస్తున్నారట. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న వేణు ఢిల్లీ -హైదరాబాద్ లలో బిజినెస్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నారట. 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీలోని పాత్ర కోసం ముందు అడిగితే లైట్ తీసుకుని నేను సినిమాలు చేయడం మానేశానన్నారట. ఫైనల్ గా కథ వినడానికి ఒప్పుకున్నారట.

కథ విన్నాక చెప్పిన క్యారెక్టర్ సినిమాలో ఎంత వరకు వుంటుందో.. ఎంత తీసేస్తారో చెప్పమన్నారట. అయితే శరత్ మండవ మాత్రం సింగిల్ కట్ కూడా వుండదు. మీకు చెప్పింది చెప్పినట్టుగా సినిమాలో యాజిటీజ్ గా చూపిస్తామని చెప్పారట. దాంతో 'రామారావు ఆన్ డ్యూటీ'తో హీరో వేణు మళ్లీ డ్యూటీ ఎక్కారట. కామెడీ చిత్రాల్లో మాత్రమే నటించిన హీరో వేణు పాత్ర ఈ మూవీలో కొంత సీరియస్ గా సాగుతున్నట్టుగా లుక్ ని బట్టి చూస్తే స్పష్టమవుతోంది. హీరో రవితేజతో సామానంగా ట్రావెల్ అయ్యే పాత్ర కావడం వల్లే ఈ సినిమాని హీరో వేణు అంగీకరించారని తెలుస్తోంది.