ఫ్యామిలీ మ్యాన్ అవతారంలో సుధీర్ బాబు

Fri May 29 2020 15:40:22 GMT+0530 (IST)

Actor Sudheer Babu with His Wife And Kids

మహమ్మారి దెబ్బకు గత రెండు నెలలుగా ఎక్కువమంది తమ ఇళ్లకే పరిమితమయ్యారు.  సాధారణ ప్రజలే కాదు.. సెలబ్రిటీలు కూడా అందరూ ఫ్యామిలీతో గడుపుతున్నారు.  టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కూడా ఈ టైమ్ ను అటు ఫిట్నెస్ పై ఫోకస్ చేయడం ఇటు కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయించారు.  తాజాగా సుధీర్ బాబు ఫ్యామిలి పిక్ ఒకటి బయటకు వచ్చింది.ఈ ఫోటోలో సుధీర్ బాబుతో పాటుగా ఆయన సతీమణి ప్రియదర్శిని ఘట్టమనేని..  తనయులు చరిత్ మానస్.. దర్శన్ కూడా ఉన్నారు.  సుధీర్ ఈ ఫోటోలో ఓ స్లీవ్ లెస్ టీ షర్టు ధరించి గడ్డం పెంచి కూలింగ్ క్లాసెస్ తో సూపర్ కూల్ గా క్యాజువల్ గా ఉన్నారు.  అందరూ మంచి స్మైలింగ్ ఫేస్ తో కనిపిస్తున్నారు.  ఈ ఫోటో చూస్తుంటేనే సుధీర్ బాబు తన ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా సరదాగా గడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇక సినిమాల విషయానికి వస్తే నాని తో కలిసి నటించిన 'V' రిలీజుకు రెడీగా ఉంది.  ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు.  ఈ సినిమాతో పాటుగా పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో కూడా నటిస్తున్నాడు.