'సార్' కు పాజిటివ్.. షూటింగ్ బ్రేక్

Mon Jan 24 2022 23:00:01 GMT+0530 (IST)

Actor Dhanush Tested Positive

ధనుష్ హీరోగా మన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న బహు బాష చిత్రం 'సార్'. ఈ సినిమా తో ధనుష్ మొదటి సారి టాలీవుడ్ లో డైరెక్ట్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకు కోలీవుడ్.. బాలీవుడ్ లో కమర్షియల్ సక్సెస్ లు దక్కించుకుని స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నా కూడా టాలీవుడ్ లో మాత్రం ధనుష్ మంచి సక్సెస్ ను దక్కించుకోలేదు. ధనుష్ నటించిన డబ్బింగ్ సినిమాలు తెలుగు లో చాలానే విడుదల అయ్యాయి. కాని అందులో ఒకటి రెండు తప్ప పెద్దగా సక్సెస్ దక్కించుకున్న దాఖలాలు లేవు. అందుకే టాలీవుడ్ లో సినిమా చేయాలని ధనుష్ భావించినట్లుగా తెలుస్తోంది. తెలుగు లో సినిమా చేయడం వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని ఆయన ప్లాన్. సార్ సినిమా తాజాగా షూటింగ్ ప్రారంభం అయ్యింది. హడావుడిగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా షూట్ కు బ్రేక్ పడింది.సార్ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది మొదలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతూ ఉన్నారు. ఈసమయంలో ధనుష్ కు కోవిడ్ పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడ్డట్లయ్యింది. సార్ చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచి పోయింది అంటూ యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ విడాకుల విషయం ప్రకటించిన సమయంలో కాని సార్ సినిమా చిత్రీకరణ నిలిచి పోయినట్లగా వార్తలు రాలేదు. కాని ఇప్పుడు ఆయన ఆరోగ్యం సరిగా లేని కారణంగా షూటింగ్ వాయిదా పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. సార్ సినిమా చిత్రీకరణ కేవలం మూడు నాలుగు నెలల్లోనే ముగించాలని దర్శకుడు వెంకీ అట్లూరికి ధనుష్ ముందుగానే కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

ధనుష్ ఒక వైపు బాలీవుడ్ సినిమా మరో వైపు హాలీవుడ్ సినిమాలు కూడా చేస్తున్న ధనుష్ తమిళం లో రెగ్యులర్ గా మూడు నాలుగు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా సినిమా చేస్తున్నాడు. సార్ సినిమా మాత్రమే కాకుండా తెలుగు లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా ను ధనుష్ చేయబోతున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల.. ధనుష్ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. సార్ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా మొదలు అయ్యేనో చూడాలి. సార్ సినిమా ను ఈ ఏడాదిలోనే విడుదల చేసే అవకాశం ఉండగా.. శేఖర్ కమ్ముల సినిమా తో ధనుష్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.