మద్దాలి శివారెడ్డి ఇంట కరోనా పాజిటివ్

Tue Jul 14 2020 20:00:22 GMT+0530 (IST)

virus Positive? at Maddali Shivareddy home

తెలుగు ప్రేక్షకులకు మద్దాలి శివారెడ్డిగా సుపరిచితం అయిన రేసు గుర్రం నటుడు రవి కిషన్ ఇంట కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెళ్లడి చేశాడు. తన వద్ద పీఏగా చేస్తున్న గుడ్డూ పాండే కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అనుమానం వచ్చి ఆయనకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది. ఆయన త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నాను.పాండేకు కరోనా పాజిటివ్ రావడంతో నేను కూడా పరీక్షలు చేయించుకున్నాను. నాతో పాటు నా కుటుంబం మొత్తం కూడా ప్రస్తుతం స్వీయ నిర్భందంలో ఉన్నామంటూ రవి కిషన్ పేర్కొన్నాడు. నటుడిగా పలు భాషల్లో నటించి మెప్పించిన రవి కిషన్ ప్రస్తుతం ఎంపీగా సేవలు అందిస్తున్న విషయం తెల్సిందే. ఎంపీ అయినప్పటి నుండి నటనకు దూరంగా ఉంటున్నాడు.

మళ్లీ నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా కొన్ని రోజుల క్రితం ప్రకటించాడు. ఆయన ఇంట కరోనా పాజిటివ్ కేసు నమోదు అవ్వడంతో అభిమానులు మరియు ఆయన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని తాను కుటుంబ సభ్యులం సేఫ్ గానే ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి సేఫ్ గా ఉండాలంటూ తన నియోజక వర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.