Begin typing your search above and press return to search.

ప్రేమకు వయసుతో పనేముంది..!

By:  Tupaki Desk   |   28 May 2023 10:41 AM GMT
ప్రేమకు వయసుతో పనేముంది..!
X
తెలుగులోనే కాదు సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీలో కూడా సినిమాలు చేస్తూ అలరించిన ఆశిష్ విద్యార్థి లేటెస్ట్ గా రూపాలి బారువా ను పెళ్లాడిన విషయం తెలిసిందే. తన రెండో పెళ్లి విషయం గురించి చెబుతూ ఆశిష్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు ఆశిష్ విద్యార్థి. మొదటి భార్య నుంచి విడిపోవాల్సిన పరిస్థితి గురించి చెబుతూ బేధాభిప్రాయాలు కలిసి మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయేమో కానీ అక్కడ ఎవరో ఒకరు మరొకతి మాటకు వారి అభిప్రాయానికి గౌరవం ఇవ్వాని. అప్పుడు ఎవరో ఒకరు సంతోషానికి దూరం అవుతారని ఆశిష్ అన్నారు.

ఆనందం అనేది అందరికీ చెందాలి కదా.. తనకు ఈ టైం లో ఒక తోడు కావాలని అనిపించడంతో మళ్లీ పెళ్లి చేసుకున్నానని అన్నారు. తనకు ఇంకా 60 ఏళ్లు రాలేదని తను పెళ్లి చేసుకున్న రూపాలి వయసు కూడా 30 ఏళ్లు కాదని అన్నారు ఆశిష్ విద్యార్థి. రొపాలితో రెండేళ్లుగా చాటింగ్ చేస్తున్నానని.. తనతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నానని అన్నారు. ప్రేమకు వయసుతో పనిలేదని.. ఇద్దరం సంతోషంగా కలిసి ప్రయాణిస్తామని అన్నారు ఆశిష్ విద్యార్థి.

నటుడిగా తన వెరటైల్ యాక్టింగ్ తో మెప్పిస్తూ వచ్చిన ఆశిష్ విద్యార్థి ఈ ఏజ్ లో రెండో పెళ్లి చేసుకుంటాడని ఎవరు ఊహించలేదు. అయితే భార్య నుంచి విడిపోవడం ఒంటరితనాన్ని భరించలేని ఆయన ఒక తోడు కావాలని అనుకున్నారు. అందుకే రూపాలిని పెళ్లి చేసుకున్నానని అన్నారు. రూపాలితో తనకు కొన్నాళ్లుగా పరిచయం ఉందని ఆమెతో తన జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పారు.

ఆశిష్ విద్యార్థి దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ సినిమాల్లో అలరిస్తూ వస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా నటించిన ఆయన ఈమధ్య కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. అయితే ఈ ఏజ్ లో పెళ్లేంటని ఆయన్ను కొందరు కామెంట్ చేస్తున్నా అవేవి పట్టించుకోకుండా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఆశిష్ విద్యార్ధి.

ఆశిష్ విద్యార్ధి పెళ్లి చేసుకున్న రూపాలి ఒక ఫ్యాషన్ బిజినెస్ చేస్తున్న బిజినెస్ ఉమెన్. కలకత్తాలో ఆమె క్లాతింగ్ బిజినెస్ చేస్తుంటారు. రూపాలి కూడా అంతకుముందు మితం బరూహ అనే బిజినెస్ మెన్ ని పెళ్లాడారు. వారిద్దరికి ఒక పాప కూడా ఉంది. అయితే అతను అనారోగ్యం కారణంగా చనిపోవడంతో ఆమె యూకెకి వెళ్లారు. తన భర్తతో కలిసి నేమ్ జి స్టోర్ అనే క్లాతింగ్ కంపెనీ నడిపించారు.