Begin typing your search above and press return to search.

వయసులో 21 ఏళ్ల వ్యత్యాసం.. పొలిటిషయన్ ను పెళ్లాడిన టీవీ నటి!

By:  Tupaki Desk   |   28 May 2023 6:32 AM GMT
వయసులో 21 ఏళ్ల వ్యత్యాసం.. పొలిటిషయన్ ను పెళ్లాడిన టీవీ నటి!
X
గతానికి భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమకు.. పెళ్లికి వయసుతో సంబంధం లేదంటున్న రిలేషన్లు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. రెండురోజుల క్రితమే టాలీవుడ్ రీల్ విలన్ ఆశిష్ విద్యార్థి తన అరవై ఏళ్ల వయసులో వ్యాపారవేత్త రూపాలి బారువాను రెండో పెళ్లి చేసుకున్న వైనం సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో తెలిసిందే. అనూహ్యంగా ఇదే తరహాలో మరో సెలబ్రిటీ వివాహం బయటకు వచ్చింది. భర్త పేరున్న పొలిటీషియన్.. భార్య పేరు ప్రఖ్యాతులున్న టీవీ నటి. తాజాగా ఆమె మిసెస్ అందాల పోటీలో బరిలో దిగుతున్న వేళ.. తనకు పెళ్లైందని.. పదేళ్ల క్రితమే తన వివాహం జరిగినట్లుగా చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇంతకూ ఆ టీవీ నటి ఎవరంటే.. స్నేహల్ రాయ్. తన కంటే 21 ఏళ్ల పెద్దవాడైన పొలిటిషన్ ను పెళ్లాడిన ఆమె వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇష్క్ కా రంగ్ సఫేద్ సీరియల్ తో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకున్న ఆమె.. జన్మో కా బంధన్.. విష్.. పర్ ఫెక్టు పతి.. ఇచ్చప్యారీ నాగిన్ టీవీ సీరియళ్లతో పాటు.. షోలను చేస్తుంటారు చురుకైన నటిగా పేరున్న ఆమెకు ఇప్పటివరకు పెళ్లి కాలేదనే అనుకున్నారు.

ఆమె బ్యూటీ కాంటెస్టులో పాల్గొంటున్న తన వైవాహిక జీవితం గురించి బయటకు వెళ్లడించారు. ఉత్తరప్రదేశ్ లోని బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ)కి ప్రాతినిధ్యం వహించే మధ్వేంద్ర కుమార్ రాయ్ తో పదేళ్ల క్రితమే తమ పెళ్లి జరిగినట్లు చెప్పి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయ నేతగా మధ్వేంద్రకు మంచి పేరే ఉంది. చాలామంది నేతల మాదిరి నేరమయ జీవితానికి దూరంగా ఉంటారని చెబుతున్నారు. ఎన్నికల వేళ.. ఎన్నికల కమిషన్ కు కేటాయించే పత్రాల్లో ఆయన తన ఆస్తి పాస్తుల వివరాల్ని వెల్లడించారు. వ్యాపారాలు చేసే అతడికి సంపద విషయంలో ఎలాంటి ఢోకా లేదని.. వెల్ సెటిల్డ్ గా చెబుతున్నారు.

నటిగా తనకు తన భర్త నుంచి తన కుటుంబం నుంచి ఫుల్ సపోర్టు లభిస్తుందని చెప్పిన ఆమె.. తన భర్త తనతో చెప్పిన మాటల్ని తాజాగా ఒక మీడియా సంస్థకు షేర్ చేసింది. ''ఒకసారి నాతో ఆయన అన్న మాటను మర్చిపోలేను అదెంతో స్ఫూర్తిని ఇచ్చింది. నువ్వు నా మహరాణివి. రాణిలా పని చేయ్. నువ్వు విజయం సాధిస్తావో.. లేదో అన్నది అప్రస్తుతం. నువ్వు ఎలా ఉన్నా.. నా మనసుకు మాత్రం నువ్వే మహరాణివి అని చెప్పారు. ఆ మాటలను నన్నెంతో ప్రభావితం చేశాయి. నాలో స్ఫూర్తిని రగిలించాయి'' అని చెప్పుకొచ్చారు.

ఇంతకూ వారి ప్రేమాయణం ఎలా షురూ అయ్యిందన్న విషయానికి వస్తే.. ఒక షోలో తామిద్దరం కలిశామని.. మాట్లాడుకున్నామని.. తర్వాతి రోజు విమాన ప్రయాణంలో మళ్లీ కలిసినట్లుగా చెప్పారు. అలా మొదలైన తమ పరిచయం మరింత బలపడిందని.. తర్వాత ఆయన కంపెనీ నిర్వహించే కార్యక్రమాలకు తాను హోస్ట్ చేసినట్లుా చెప్పారు. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. తన తల్లిదండ్రుల జీవితాల్లో మాదిరి.. విడిపోకుండా కలిసి ఉండాలన్నదే తన లక్ష్యమని చెబుతారు.

తన చిన్నతనంలో తన తల్లిదండ్రులు విడిపోయారని.. తాను తన తల్లి పెరిగినట్లు చెప్పారు. డబ్బుల్లేక అర్థాకలితో.. మంచినీళ్లతో కడుపు నింపుకున్న వైనాన్ని తాను ఎప్పటికి మర్చిపోలేనని చెప్పుకొచ్చారు. తామిద్దరి మధ్య వయసు వ్యత్యాసం గురించి మాట్లాడుకున్నది లేదన్నారు. అదసలు సమస్యే కాదన్న ఆమె.. ఇరువురి మధ్య ధ్రుఢమైన మానసిక అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. వీరిద్దరి పెళ్లి ముచ్చట మీడియాలోనూ.. సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.