అన్ స్టాపబుల్ విత్ NBK .. మహేష్ ఫీలింగ్ ఇదీ!

Sun Dec 05 2021 22:00:01 GMT+0530 (IST)

Absolutely enjoyed with NBK Unstoppable Mahesh Babu

ఆహా-ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ విత్ NBK కేవలం 3 ఎపిసోడ్ లతో గొప్ప ప్రజాదరణ పొందింది. ఈ క్రెడిట్ మొత్తం హోస్ట్ నందమూరి బాలకృష్ణకే చెందుతుంది. అతిథులతో అతని చమత్కారమైన .. ఫన్నీ ఇంటరాక్షన్ షో వీక్షకు్లో ఎంతో ఆసక్తికరంగా మారింది.ఇప్పటి వరకు ఈ షోలో సినీ నటులు మోహన్ బాబు- నాని- బ్రహ్మానందం- అనిల్ రావిపూడి కనిపించారు. ఇప్పుడు వీరికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తోడయ్యాడు. ఎన్ బికెతో అన్ స్టాపబుల్ షూటింగ్ సమయంలో మహేష్ బాబు.. బాలకృష్ణతో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకున్నారు. అతను ఇలా వ్రాశాడు. ``నా సాయంత్రాన్ని అన్ స్టాపబుల్ NBK తో పూర్తిగా ఆనందించాను`` అని వ్యాఖ్యానించారు.
నిన్నటితో షూటింగ్ పూర్తయింది. ఇది ఎపిసోడ్ 4గా ప్రసారం అవుతుందా లేదా అనేది షో నిర్వాహకులు ప్రకటించాల్సి ఉంది. అంతేకాకుండా ఈ ఎపిసోడ్‌ని చూసేందుకు ఇరువురు నటీనటుల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలయ్య నటించిన అఖండ ఘనవిజయం సాధించింది. ఇక మహేష్ నటించిన సర్కార్ వారి పాట థియేటర్లలో సత్తా చాటాల్సి ఉంది. ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి వాయిదా పడిన సంగతి తెలిసిందే. బాలయ్య ..మహేష్ వరుస చిత్రాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.