డేటింగ్ యాప్ లో ప్రత్యక్షమైన టాప్ డైరెక్టర్ కుమార్తె ప్రొఫైల్!

Thu Jun 10 2021 09:00:01 GMT+0530 (IST)

Aaliyah Kashyap reacts to fake dating profile

ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ పేరు ఇటీవల మీడియా హెడ్ లైన్స్ లో ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆలియా డేటింగ్ వ్యవహారాలతో పాటు కాంట్రవర్శీలు ట్రోల్స్ వగైరా చర్చకు వచ్చాయి. తాజాగా ఓ ప్రముఖ డేటింగ్ యాప్ లో ఆలియా నకిలీ ప్రొఫైల్ ప్రత్యక్షమైంది. అయితే దీనిని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆలియా తన ఫాలోవర్స్ ను అభ్యర్థించారు.ప్రస్తుతం ముంబైలో ఉన్న అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ డేటింగ్ యాప్ లో సృష్టించిన తన నకిలీ ప్రొఫైల్ పై స్పందించారు. ఎవరో ఆమె పేరు మీద ఒక ఖాతాను ఓపెన్ చేసి సినీ పరిశ్రమ నుండి కొంతమంది కుర్రాళ్లను కలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

తన ఇన్ స్టా ప్రొఫైల్ లో ఆలియా డేటింగ్ యాప్ స్క్రీన్ షాట్ ను పంచుకున్నారు. వెంటనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలని ఆమె తన అనుచరులను కోరారు. స్క్రీన్ షాట్ తో పాటు డేటింగ్ యాప్ ఓక్ కుపిడ్ గురించి వెల్లడించారు. ఆ యాప్ ప్రొఫైల్ కు ఆలియా సమాచారం ఉంది. ``గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సహా అనేక ఇతర చలన చిత్రాల దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె`` అని రాసి ఉంది.

మరోవైపు అనురాగ్ ఇటీవల ముంబైలోని ఓ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అతను తేలికపాటి ఛాతీ నొప్పితో బాధపడ్డారు. ఆలియా ఇటీవల తన తండ్రి చేసిన ఫన్నీ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. వీడియోలో అనురాగ్ తన బట్టతల రూపాన్ని చూపిస్తూ కనిపించాడు.

అతను శస్త్రచికిత్స చేయించుకున్నట్లు అనురాగ్ ప్రతినిధి ధృవీకరించారు. యాంజియో ప్లాస్టీ అనంతరం ఇప్పుడు కోలుకుంటున్నాడని తెలిపారు. ఆలియా కశ్యప్ అమెరికాలో తన చదువును కొనసాగిస్తోంది. ఇన్ స్టాలో యాక్టివ్ గాళ్ గా పాపులర్. ఇటీవల తన ప్రియుడు షేన్ గ్రెగోయిర్ తో డేట్ నైట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి.